మా ఆయన చాలా కూల్ కూల్​.. రానాకు మిహికా కితాబు

Update: 2020-11-13 09:10 GMT
యంగ్​హీరో రానా బ్యాచ్​లర్​ లైఫ్​కి గుడ్​బాయ్​ చెప్పి ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు మిహికా బజాజ్​ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కరోనా టైంలో కొంతమంది సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. అయితే  మిహికా మీడియాతో పెద్దగా టచ్​లో ఉండదు. దాంతో పాటు ఆమె సోషల్​మీడియాలో కూడా అంతగా  యాక్టివ్​గా ఉండదు. హనీమూన్​ టైంలో ఈ ఫొటో షేర్​ చేసుకుంది. దసరా సందర్భంగా మిహికా, రానాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆమె ఏ పోస్ట్​ పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన భర్త రానా గురించి ఇన్ స్టా లో ఓ పోస్ట్​ చేశారు. ‘మా ఆయన రానా మిస్టర్​ కూల్​’ అంటూ ఆమె పోస్ట్ ​చేశారు.

ఇటీవల  రానా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను స్టార్ట్ చేసి .. ‘వైఆర్‌యూ’ అనే షోని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎందరో సెలబ్రిటీలను ఆయన ఈ షోకి తీసుకురానున్నారు.  ఈ  ప్రోగ్రామ్​ ప్రమోషన్​లో భాగంగానే మిహికా ఈ పోస్ట్​ పెట్టినట్టు టాక్​. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొత్త యూట్యూబ్​ చానల్​లో పలురకాల కథలను రానా చెప్పబోతున్నాడట. దీంతో పాటు ఇంటర్వ్యూలు సంగీతం, యానిమేషన్​, ఫిక్షన్​ తదితర అంశాలు ఉండనున్నాయట.

అయితే  ఈ సందర్బంగా రానా సోషల్ ​మీడియాలో ‘ ఆస్క్​ మీ ఎనీథింగ్​’  సెషన్ నిర్వహించాడు. దీంతో ఓ యువతి ‘రానా నీకు పెళ్లైనా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ కామెంట్​ పెట్టారు. దీనికి రానా స్పందిస్తూ  ‘ మీ కామెంట్​ చదివితే మిహికాకు పిచ్చి ఎక్కడం ఖాయం’ అని రిప్లై ఇచ్చారు. దీనికి మిహికా కూడా ఫన్నీగా స్పందించారు. ‘నేను నీతో  గడిపిదానికంటే ఎక్కువ పిచ్చి ఎక్కదులే’ అంటూ కామెంట్​ పెట్టారు. ప్రస్తుతం ఈ కన్వర్జేషన్​ సోషల్ ​మీడియాలో వైరల్​ గా మారింది.  ​ రానా నటించిన ‘అరణ్య’ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ‘హాథి మేరే సాథి’ ‘1945’ ‘ హిరణ్య కశ్యప’ ‘ విరాటపర్వం’ తదితర చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాలన్ని ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ దశ లో ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఈ పాటికి చాలా వరకు రిలీజ్ అయి ఉండేవి.
Tags:    

Similar News