ట్రైలర్ టాక్ : మధ్యతరగతి యువకుడి జీవన పోరాటంగా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'..!

Update: 2020-11-10 08:50 GMT
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మిడిల్ క్లాస్ మెలోడీస్''. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రంతో వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. జనార్ధన్ పసుమర్తి ఈ సినిమాకి స్టోరీ మరియు డైలాగ్స్ రాశాడు. స్వీకర్‌ అగస్తి సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే టైటిల్ కి తగ్గట్టే ఇందులో మిడిల్ క్లాస్ జీవితాలను చూపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆనంద్ దేవరకొండ ఇందులో రాఘవ అనే యువకుడిగా కనిపిస్తున్నాడు. ఓ ఊర్లో తండ్రి నిర్వహించే టిఫిన్ సెంటర్ లో 'బాంబే చట్నీ' అనే స్పెషల్ చట్నీ కి రాఘవ పేరుగాంచాడు. దీంతో రాఘవ గుంటూరు కు వెళ్లి హోటల్ పెడితే సక్సెస్ అవుతుందని భావించి సొంతంగా హోటల్ పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. అయితే గుంటూరులో హోటల్ ఏర్పాటు చేసిన రాఘవకు అనుకోని పరిణామాలు ఎదురైనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తోంది. మొత్తం మీద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు కనే కలలు.. వారి జీవన విధానం.. జీవన ప్రయాణాలు ఎలా సాగుతాయనేది ఇందులో చూపించారు. ఆనంద్ దేవరకొండ సగటు మిడిల్ క్లాస్ యువకుడిగా బాగా నటించినట్లు అర్థం అవుతోంది. మధ్యతరగతి జీవితాలకు అద్దంపట్టేలా ఉన్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News