యాంకర్ అవతారంలో అరబ్ పోర్న్ స్టార్

Update: 2017-10-16 05:54 GMT
2016లో గూగులో అందరికంటే ఎక్కువగా సెర్చ్ చేయబడిని పోర్న్ స్టార్ ఎవరంటే.. అరబ్ సంతతికి చెందిన మియా ఖలీఫా అంటూ ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అప్పటికే ఆమె పోర్న్ సినిమాల్లో నటించడం మానేసినా కూడా.. ఆమెకు వరల్డ్ వైడ్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మిడిల్ ఈస్ట్ లోని లెబనాన్ కు చెందిన ఈమె.. ఒక ముస్లిం అయ్యుండీ పోర్న్ సినిమాల్లో నటిస్తావా అంటూ ఉగ్రవాద సంస్థల నుండి డెత్ వార్నింగులను కూడా ఎదుర్కొంది. అయితే అమెరికాలో స్థిరపడ్డాక ఆమె క్రిస్టియన్ క్రింద మారిపోయింది.

ఇకపోతే పోర్న్ సినిమాలను వదిలేసిన తరువాత.. చాలా ఎక్కువగా స్పోర్ట్స్ మ్యాచ్ ల గురించి మాట్లాడుతూ.. తన సోషల్ మీడియా పేజీల్లో నానా హంగామా చేయడం స్టార్ట్ చేసింది మియా. ఆమెకు బేస్ బాల్.. అమెరికన్ ఫుట్ బాల్ అలాగే ఇతర క్రీడలంటే చాలా ఇష్టమని అదంతా చూస్తే ఎవరికైనా అర్ధమవుతోందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు ఒక ఛానల్ వారు మియా తాలూకు క్రేజ్ ను.. క్రీడల పట్ల ఆమెకు ఉన్న మక్కువను కలిపి వాడుకోవాలని ఫిక్సయ్యారు. 'కాంప్లెక్స్ న్యూస్' అనే యుట్యూబ్ ఛానల్ లో మరో బాస్కెట్ బాల్ ప్లేయర్ తో కలసి ఇప్పుడు 'ఔట్ ఆఫ్‌ బౌండ్స్' అనే టాక్ షో వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది మియా. మన కాలమానం ప్రకారం.. రేపు మధ్యాహ్నం ఈ షో ఇండియన్ ఫ్యాన్స్ చూడొచ్చు.

మొత్తానికి పోర్న్ ప్రపంచం నుండి బయటకొచ్చాక చాలా చేయొచ్చు అని ఆల్రెడీ ఇండియన్ సంతతికి చెందిన కెనెడియన్ వనిత సన్నీ లియోన్ ప్రూవ్ చేస్తే.. ఇప్పుడు అదే తరహాలో మియా కూడా ప్రయాణం చేస్తోంది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో!!
Tags:    

Similar News