అ గాసిప్పులపై గుస్సా అయిన మెగాస్టార్!
'సైరా' తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ 'ఆచార్య' అని ఈమధ్య మెగాస్టార్ స్వయంగా లీక్ చేశారు. ఈ సినిమాలో అతిథి పాత్ర గురించి గత కొంతకాలంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. నిజానికి ఈ చిరు - కొరటాల శివ సినిమా ప్రస్తావన వస్తే చాలు అది తప్పనిసరిగా గెస్ట్ రోల్ పోషించబోయే స్టార్ హీరో చుట్టూనే కేంద్రీకృతమై ఉంది.
మొదట్లో ఈ అతిథి పాత్ర లో రామ్ చరణ్ నటిస్తారని అన్నారు. తర్వాత అల్లు అర్జున్.. మహేష్ బాబు పేర్లు తెరపైకి వచ్చాయి. జస్ట్ మెగాస్టార్ సినిమా లో ఈ స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా ఇదో మల్టిస్టారర్ సినిమా అన్నట్లుగా ప్రచారం సాగుతుండడం చిరుకు చిరాకు తెప్పించిందట. అయినా చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు చిరును చూడడానికే వస్తారు కానీ అందులో గెస్ట్ రోల్ లో నటించిన హీరోలను.. హీరోయిన్లను చూడడానికి కాదు కదా. ఎవరు నటించినా.. నటించక పోయినా చిరు సినిమా కు పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సరిగ్గా ఈ విషయం పైనే మెగాస్టార్ తన పబ్లిసిటీ టీమ్ కు గట్టిగా క్లాస్ పీకారట.
ఈ అంశంలో మెగాస్టార్ ఆలోచన నిజమే అనుకోవాలి. ఈ గాసిప్పులు పెరిగి పెరిగి అది మెగాస్టార్ సినిమా కాకుండా మహేష్ సినిమాలాగానో.. అల్లు అర్జున్ సినిమా లాగానో మారి పోయేలా ఉందని ఇండస్ట్రీ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ అతిథి పాత్రకు సంబంధించిన గోల ఇలా ఉంటే మరో వైపు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారట. ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భం గా ఆగస్టు 14 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.