ఇచ్చి పుచ్చుకోవ‌డంలో మెగా సూప‌ర్ బాండింగ్!

Update: 2020-03-06 03:55 GMT
ఒక‌ హీరో సినిమా కోసం మరో హీరో సపోర్ట్ గా నిలవడమనే కల్చర్‌ ఇటీవల నడుస్తోంది. ఇతర భాషల హీరోలు అయినా ప్రమోషన్ లో మరో భాషకు చెందిన హీరోలు సాయానికి రావ‌డం.. హైప్‌ని తేవ‌డం ట్రెండ్ అవుతోంది. సినిమా అనేది యూనివర్సల్‌ అని.. దానికి భాషా బేధం లేదని నిరూపిస్తున్నారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడంలో ముందుంటున్నారు. జనానికి సినిమాని చేరవేయడంలో తనవంతు కృషి చేస్తున్నారు. 'అర్జున్‌ సురవరం', 'ఓ పిట్ట కథ' చిత్రాలకు ఆయన అందించిన సహకారమే అందుకు నిదర్శనం.

ఇప్పుడు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ కోసం మెగాస్టార్ .. మెగా ప‌వ‌ర్ స్టార్ ఇద్ద‌రూ దిగొస్తున్నారు. చిరంజీవి- రామ్ చరణ్‌ కలిసి మోహన్ లాల్‌ నటించిన తాజా సినిమా 'మరక్కార్‌' చిత్ర ట్రైలర్ ని ఆవిష్కరించబోతున్నారు. శుక్ర‌వారం సాయంత్రం 5 గంటలకు తెలుగు వెర్షన్‌ ట్రైలర్ ని చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి విడుదల చేయబోతున్నారు. చిరంజీవి తన కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ప్లాట్ ఫామ్ పై.. చరణ్‌ తన ఫేస్‌ బుక్‌ ద్వారా ఈ ట్రైలర్ ని అభిమానులతో పంచుకోనున్నారు.

ఇండియన్‌ ఎపిక్‌ హిస్టారికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ లాన్‌ టైటిల్‌ రోల్ ని పోషిస్తున్నారు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో 16వ శతాబ్ధం నేపథ్యంలో దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. మలయాళంలో ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న తొలి సినిమా 'మరక్కార్‌' కావడం విశేషం. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు-తమిళం- కన్నడ-హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఐదువేల స్క్రీన్స్ లో ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు.

ఇక మోహ‌న్ లాల్ న‌టిస్తున్న భారీ చిత్రాల్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయ‌కుడిగా రీమేక్ చేసేందుకు చ‌ర‌ణ్ ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే లాల్ కి కావాల్సిన ప్ర‌చార సాయం చేస్తున్నార‌న్న‌మాట‌. ఇంత‌కుముందు ఎయిటీస్ స్టార్స్ సెలబ్రేష‌న్స్ లోనూ మెగాస్టార్ - సూప‌ర్ స్టార్ బాండింగ్ ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక చిరు - లాల్ ఇచ్చిపుచ్చుకునే మ్యూచువ‌ల్ బాండింగ్ ని కొన‌సాగిస్తుండ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News