• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంబీతో మెగాస్టార్ బంధం

అంబీతో మెగాస్టార్ బంధం

By - Tupaki Desk
Update: 2018-11-25 06:38 GMT
కన్నడ సినిమా రంగంతో పాటు యావత్ శాండల్ వుడ్ ప్రేక్షకులు విఖ్యాత నటులు అంబరీష్ మరణం పట్ల నిన్న రాత్రి నుంచే శోక సముద్రంలో మునిగిపోయారు. ఇంత హటాత్తుగా ఆయన కాలం చేయడాన్ని జీరించుకోలేక ప్రముఖ స్టార్లు సైతం శోకాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెండు వందల సినిమాలకు పైగా నటనానుభవం ఉన్న అంబరీష్ చివరి సినిమా ఇటీవలే విడుదలైంది. అంబీ నినిగె వయసాయితు దాని పేరు. అంటే పెద్దాయన నీకు వయసైపోయింది అని అర్థం. కిచ్చా సుదీప్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాదించింది.

అంబరీష్ ముద్దు పేరే అంబీ. ఈయనకు టాలీవుడ్ లో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఫ్యామిలీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ బంధం ఈ ఇద్దరి మధ్య ఉండేది. అంబరీష్ భార్య సుమలత ఒకప్పుడు 80 దశకంలో తెలుగులో టాప్ హీరొయిన్లలో ఒకరు. చిరంజీవితో శుభలేఖ మొదలు ఖైది ఆపై వేట నుంచి పసివాడి ప్రాణం దాకా చాలా సినిమాలలో నటించారు.

చిరంజీవి బెంగుళూరు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా అంబరీష్ ఇంటికి వెళ్ళకుండా తిరిగి రారు. ఆ మధ్య కన్నడ నటీనటుల సంఘానికి కొత్త బిల్డింగ్ నిర్మించినప్పుడు దాని ఓపెనింగ్ కి అంబరీష్ ప్రత్యేకంగా చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలిచారు. వాటి తాలుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అంబరీష్-చిరు ఇద్దరు కలిసి నటించిన చిత్రం శ్రీ మంజునాథ. అందులో సుమలత కూడా ఉన్నారు.

అంబరీష్ దంపతులు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా చిరు ఆతిధ్యం తప్పనిసరి. ఇంత ఘాడమైన బంధం ఉన్న మిత్రుడి మరణం చిరుకి షాక్ కలిగించింది. ఆయన హుటాహుటిన చివరి సందర్శన కోసం బెంగుళూరు బయలుదేరినట్టు సమాచారం. సూపర్ స్టార్ రజనికాంత్ ఇవాళ తెల్లవారుఝామునే బెంగుళూరు చేరుకుని కాసేపటి క్రితమే పార్ధీవ దేహాన్ని సందర్శించి సుమలతను ఓదార్చారు. రెబెల్ స్టార్ అని మనకు కృష్ణం రాజు గారికి పేరుంటే అక్కడ అంబరీష్ ని అభిమానులు రెబెల్ స్టార్ అని పిలుస్తుంటారు.
Tags:    
  • Megastar Chiranjeevi 
  • Ambarish 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS