చిరు అతిథిగా సంగీత దర్శకుడు రఘు కుంచె కుమార్తె పెళ్లి
ఆప్యాయతలు అనురాగం పంచడం అంటే ఏమిటి? ఉమ్మడి కుటుంబాలు అంతమవుతూ సోలో కుటుంబాలు ఆపసోపాల పాలవుతున్న నేటి అయోమయ సమాజంలో బిజీ బిచ్ లైఫ్ లో బంధాల్ని అనుబంధాల్ని కాపాడం ఎలా? .. ఒక ఇండస్ట్రీలో అంతా తనవారే అనుకుని అందరికీ నేనున్నానని నిరూపించాలంటే అందుకు ఏం చేయాలి..? ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రశ్నలకు సమాధానం అంత సులువేమీ కాదు.
ఇటీవల ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి నుంచి తమ ఫ్యామిలీ ఈవెంట్లలో మెగాస్టార్ లేనిదే సందడే లేదు. ఇటీవల మెగా యువహీరోలందరినీ కలుపుతూ మెగా ఫ్యామిలీలో సందడి కనిపిస్తోంది.
అలాగే ఇండస్ట్రీలోనూ అందరివాడిగా చిరు మెరిసిపోతున్నారు. ఇంతకుముందు హీరో రాజశేఖర్ కి కోవిడ్ సోకితే ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడు కావాలని కోరుకున్నారు చిరు. మెరుగైన వైద్యచికిత్స కోసం ఆస్పత్రి వర్గాలతో మాట్టాడారని కూడా ప్రచారమైంది.
ఇకపోతే ఇండస్ట్రీలో ఏవైనా పెళ్లిళ్లు ఫంక్షన్లకు చిరుని ఆహ్వానించినా వెళుతున్నారు. టాలీవుడ్ లో పలు ఈవెంట్లకు వెళ్లి ప్రచారం చేసే దానికంటే ఇలా వ్యక్తిగత కుటుంబ వేడుకలకు వెళ్లడానికి చిరు ఇష్టపడుతున్నారు.
ఇదిగో లేటెస్టుగా యువతరం సంగీత దర్శకుడు రఘు కుంచె కుమార్తె వివాహం సందర్భంగా వారి ఆహ్వానం అందుకుని నవదంపతుల్ని చిరు ఆశీర్వదించారు. చిరు రాకతో ఫ్రేమ్ కలర్ ఫుల్ గా మారింది. కొత్త జంట మోములో వెయ్యి దీపాల కాంతితో ఆ `చిరు`నవ్వు ఆహ్లదాన్ని పంచుతోంది ప్రత్యేక అతిథి సమక్షంలో. ఈ ఫోటోలో రఘు కుంచె సహా కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇక రఘు కుంచె సింగర్ గా సంగీత దర్శకుడిగా పాపులర్. పలాస 1978 చిత్రంతో ఆయన విలన్ గా పరిచయం అయ్యారు. నటుడిగానూ రఘులో కొత్త కోణం ఆకట్టుకుంది. రఘు మ్యూజిక్ చార్ట్ బస్టర్లలో నిలిచింది. ఇక ఇందులో అదిరిపోయే `నక్కిలీసు గొలుసు..` పాట ప్రతి పెళ్లిలోనూ తెగ మోగుతోంది ఈ పెళ్లిళ్ల సీజన్ పుణ్యమా అని.. !!