మెగా ప్రిన్స్ 'VT10' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!

Update: 2021-01-16 14:41 GMT
మెగా ప్రిన్స్ VT10 ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొర్రపాటి కిరణ్‌ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌ - బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌ పై అల్లు వెంకటేవ్‌(బాబీ) - సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌ గా కనిపించనున్నాడు.వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. జనవరి 19న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.    

వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేస్తున్నారు. వరుణ్ కెరీర్ లో 10వ చిత్రంగా వస్తున్న 'VT10' కోసం స్పెషల్ డైట్‌ ను పాటిస్తూ ఫిట్‌నెస్‌ ను మెయిన్‌టెయిన్‌ చేయడమే కాకుండా.. ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర - బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర కూడా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Tags:    

Similar News