మెగాస్టార్ దేశ‌భ‌క్తికి చిహ్నం ఈ వీడియో..!

Update: 2021-08-29 08:57 GMT
మెగాస్టార్ చిరంజీవి... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ .. రామ్ చ‌ర‌ణ్ .. అల్లు అర్జున్ .. సాయి తేజ్.. ఇలా మెగా కాంపౌండ్ హీరోలంతా ప్ర‌తిసారీ త‌మ‌లోని దేశ‌భ‌క్తిని దాచుకోకుండా ఓపెన్ గానే ప్ర‌ద‌ర్శిస్తారు. త‌మ సినిమాల్లో దేశ‌భ‌క్తి ఎలిమెంట్ కి ఏమాత్రం ఆస్కారం ఉన్నా అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు.

దేశం త‌ర‌పున టోక్యో ఒలింపిక్స్ లో ప‌థ‌కం గెలుచుకున్న పీవీ సింధుని స‌త్క‌రిండం ద్వారా చిరు త‌న దేశ‌భ‌క్తిని మ‌రోమారు చాటుకున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌రోనా క్రైసిస్ లో దేశం రాష్ట్రం క‌ష్టంలో ఉంది అన‌గానే త‌న‌వంతు సాయంగా ఆర్థిక విరాళాలిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి జిల్లాలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను ఏర్పాటు చేసి త‌న ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప్ర‌తిసారి సేవ‌కు నేను సైతం అని ముందుకొచ్చే మెగాస్టార్ ఇప్పుడు దేశం గ‌ర్వించ‌ద‌గ్గ తెలుగింటి ఆడ‌ప‌డుచునే అంతే గౌరవించి స‌త్క‌రించ‌డం తెలుగు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వచ్చింది. ఎంద‌రో సెల‌బ్రిటీలున్నా చిరు మాత్ర‌మే నేనున్నాను అంటూ ప్ర‌త్యేకించి త‌మ ఇంటి వ‌ద్ద పీవీ సింధుకి ఘ‌న‌మైన స‌త్కారానికి ఏర్పాట్లు చేశారంటేనే ఆయ‌న మ‌న‌సును అర్థం చేసుకోవాలి.

కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఒలింపిక్ పతక విజేత పివి సింధు కోసం పార్టీని నిర్వహించారు.  ఆ వీడియోని చిరు త‌న ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది. పివి సింధును చిరంజీవి - రామ్ చార‌ణ్ వారి నివాసంలో సన్మానించారు. మెగాస్టార్- చరణ్- సురేఖ- సుబ్బి రామ్ రెడ్డి ఈ వేడుక‌కు పీవీ సింధును ఘనంగా స్వాగతం పలిక‌గా.. ఈ వీడియోలో శ్రీజ కళ్యాణ్- ఉపాసన కొణిదెల‌- సుహాసిని- రాధిక త‌దిత‌రులు ఉన్నారు.

నాగార్జున - అఖిల్- రానా- సాయి ధరమ్ తేజ్- వరుణ్ తేజ్- అజారుద్దీన్ త‌దిత‌రులు సింధు గెలుచుకున్న ప‌త‌కాల‌తో ఫోటో క్లిక్ ల‌కు ఫోజులివ్వ‌డం క‌నిపిస్తోంది. ఈ ఘ‌న‌మైన‌ పార్టీలో మెగా కుటుంబం మొత్తం హాజరైంది. ఈ వేదికపై పీవీ సింధుకు ఘ‌న‌మైన స‌త్కారం ల‌భించింది. చిరు మ‌రోసారి శాలువా స‌న్మానంతో గౌర‌వించ‌డాన్ని తాను మ‌ర‌చిపోలేన‌ని సింధు అన్నారు. ``దేశం గ‌ర్వించేలా రెండు సార్లు పీవీ సింధు ఒలింపిక్ ప‌థ‌కాల్ని సాధించారు. త‌న‌ని స‌న్మానించ‌డం ఆనందంగా ఉంద‌``ని చిరు అన్నారు. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రు ఉన్నా త‌న‌దైన ధాతృత్వం పెద్ద‌రికంతో చిరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నా ఒక సెక్ష‌న్ మీడియా ఆయ‌న‌ను ఫోక‌స్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News