మెగా ఫ్యాన్స్‌ ప్రత్యేక పూజలు

Update: 2020-11-10 09:50 GMT
చిరంజీవి కరోనా బారిన పడ్డారనే వార్తలు మెగా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. చిరంజీవి ఆరు పదుల వయసు దాటేశారు. మొదటి నుండి జరుగుతున్న ప్రచారం మేరకు 60 ఏళ్ల పైబడిన వారు కరోనా బారిన పడితే కాస్త ప్రమాదం. కనుక చిరంజీవి ఆరోగ్యం విషయంలో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ చాలా టెన్షన్‌ పడుతున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి ఎలాంటి కరోనా లక్షణాలను అయితే కలిగి లేరు. కనుక ఆయన త్వరలోనే కరోనాను జయించి నెగటివ్‌ కు వస్తారని అంతా ఆశిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్‌ చిరంజీవి ఆరోగ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. అభిల భారత చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల పూజలు నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో చిరంజీవి పేరు మీద జరుగుతున్న పూజల ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కరోనాను జయించాలని ఫ్యాన్స్‌ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల చివరి నుండి ఆయన మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాలంటూ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి లక్షణాలు ఏమీ లేకున్నా కూడా నిపుణుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌ లో ఉన్నారు.
Tags:    

Similar News