• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ ఫాన్స్ హ్యాపీగా ఉంది...

చరణ్ ఫాన్స్ హ్యాపీగా ఉంది అందుకేనా

By - Tupaki Desk
Update: 2018-04-03 09:38 GMT
చాలా కాలం నుంచి తనకు బాకీ ఉన్న బాక్స్ ఆఫీస్ లెక్కలు సరిచేస్తున్న చిట్టిబాబు వీరంగం చూస్తున్న మెగా ఫాన్స్ ఆనందం మామూలుగా లేదు. మగధీర తర్వాత ఎన్ని హిట్స్ వచ్చినప్పటికీ దాన్ని మించే సాలిడ్ ఇండస్ట్రీ హిట్ చరణ్ కు దక్కలేదు అన్నది నిజం. ఇప్పుడు రంగస్థలం ఆ కొరతను పూర్తిగా తీరుస్తోంది. మెగా ఫాన్స్ అంతా ఒకటే అని బయటికి చెప్పుకున్నా అందులో కొన్ని వర్గాలు మాత్రం అల్లు అర్జున్-పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ అంటూ ఇలా వేరు వేరుగా ఆరాధించే వాళ్ళు లేకపోలేదు. అందుకే ఈ విషయంగా తరచూ ట్రాలింగ్ చేసుకోవడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇప్పటి దాకా పోలిక ప్రకారం చూసుకుంటే ఓవర్సీస్ లో అల్లు అర్జున్ దే పై చేయిగా ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేయటం అక్కడ బాగా వర్క్ అవుట్ అయ్యింది. కాని రెండు మిలియన్ మార్క్ మాత్రం బన్నీ ఇప్పటి దాకా చేరుకోలేకపోయాడు. చరణ్ రేంజ్ ని మించే సినిమాలు ఇక్కడ చేసినప్పటికీ టూ మిలియన్ మార్క్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది.

ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే రంగస్థలం 2 మిలియన్ మార్క్ అందుకోవడం గురించి చరణ్ ఫాన్స్ ఓ రేంజ్ లో చెప్పుకుంటున్నారు. ఈ రోజో లేక మరో రెండు రోజుల్లో 3 మిలియన్ మార్క్ అందుకోవడం కూడా సాధ్యంగానే కనిపిస్తోంది కాబట్టి అది కనక రీచ్ అయితే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్టే. ఇప్పటికే 2.5 మిలియన్ దాటేసింది కాబట్టి అదేమంత కష్టం కాదు. ధృవతో 1.5 మిలియన్ మార్క్ దాటడమే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ఈజీగా 2 మిలియన్ మార్క్ దాటడం దాకా వచ్చేసాడు చరణ్.

అయినా ఇవన్ని అభిమానుల లెక్కలు కాని చరణ్ బన్నీ ఇద్దరికీ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఆ మధ్య తన కొడుకు రంగస్థలం పాటలు పదే పదే పెట్టమని అడిగిన వీడియోని బన్నీ షేర్ కూడా చేసుకున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే ప్రత్యేకంగా విష్ కూడా చేసాడు. సో అభిమానులు చరణ్ పై చేయి సాధించాడు అని వాళ్ళు అనుకోవడమే తప్ప మెగా హీరోస్ మధ్య అటువంటి లెక్కలు పోలికలు కాని ఏమి లేవు.
Tags:    
  • Mega fans 
  • Ram charan 
  • Allu Arjun 
  • Overseas 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS