ఫస్ట్ లుక్‌: నాని లుంగీ కట్టాడహో

Update: 2017-10-18 12:49 GMT
ఈ మధ్యన చాలామంది స్టార్లు లుంగీల్లో కనిపించడానికి తెగ సరదా పడుతున్నారు. ఆల్రెడీ మన న్యాచురల్ స్టార్ చాలాసార్లు లుంగీల్లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇదే ఫీట్ చేస్తున్న వేళ.. మిడిల్ క్లాస్ అబ్బాయిగా తను కూడా అదే చేయాలని అనుకున్నట్లున్నాడు.

శ్రీమంతుడులో మహేష్‌ బాబు.. తరువాత బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్‌.. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ కాటమరాయుడు సినిమాలో.. ఇలా వరుసగా లుంగీలతో మనోళ్లు పంచాయితీ షురూ చేశారు. వీరి బాటలో చాలామంది అదే ఫాలో అయ్యారులే. ఇప్పుడు నాని కూడా చేతిలో పాల పాకెట్ పెట్టుకుని రోడ్డు మీద జోరుగా వచ్చేస్తున్న యువకుడి పాత్రలో 'ఎంసిఎ' ఎలియాస్ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' పోస్టర్ పై దర్శనమిచ్చాడు. 'ఓ మై ఫ్రెండ్‌' సినిమా తీసిన వేణు శ్రీరామ్ డైరక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో దిల్ రాజు ఈ ఏడాదికి ఆఖరి బాల్ ను ఆఖరి సిక్స్ కొట్టాలని యోచిస్తున్నారు.

అయితే మిడిల్ క్లాస్ అబ్బాయిలు లుంగీలు మానేసి షార్ట్స్ లోకి వచ్చేసి చాలా రోజులైంది కదా నాని? సరే కానివ్. న్యాచురల్ గా ఉండాలంటావ్.. అంతే కదా!!
Tags:    

Similar News