22 ఏళ్ల త‌రువాత మాస్ రాజా క్రేజీ స్టెప్‌

Update: 2022-01-12 16:30 GMT
మాస్ మ‌హారాజా ఇటీవ‌ల  గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన `క్రాక్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఊహించ‌ని స్థాయిలో 50శాతం థియేట‌ర్ ఆక్యుపెన్సీలోనూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ట్రేడ్‌పండితుల్ని ఔరా అనిపించింది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో రెట్టించిన జోష్ తో వున్న మాస్ మ‌హారాజా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాల‌ని లైన్ లో పెట్టేశాడు.

ర‌మేష్ వ‌ర్మ `ఖిలాడీ` నుంచి సుధీర్ వ‌ర్మ `న‌ర‌కాసుర‌` వ‌ర‌కు ర‌వితేజ అర‌డ‌జను చిత్రాల‌ని లైన్ లో పెట్టేశారు. ఇందులో రెండు చిత్రాలు ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, న‌ర‌కాసుర చిత్రాలు త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో మాస్ మ‌హారాజా తీసుకున్న క్రేజీ స్టెప్ హాట్ టాపిక్ గా మారింది.

హీరోగా ఏ మాత్రం ఖాలీగా లేకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాల‌ని లైన్‌లో పెట్టిన మాస్ మహా రాజా తాజాగా ఓ క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలిసింది. అదే మెగాస్టార్ చిరంజీవి మూవీ. దాదాపు 22 ఏళ్ల క్రితం  మెగాస్టార్ న‌టించిన `అన్న‌య్య‌` చిత్రంతో ర‌వితేజ న‌టించారు. ఇందులో చిరుకు సోద‌రుడిగా ర‌వితేజ క‌నిపించారు. 2000 సంవ‌త్స‌రంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. ముత్యాల సుబ్బ‌య్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సౌంద‌ర్య హీరోయిన్‌.

అన్న‌చాటు త‌మ్ముడిగా న‌టించి ఆక‌ట్టుకున్న ర‌వితేజ మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు మెగాస్టార్ తో క‌లిసి వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఇప్ప‌టికే `వాల్తేరు వీర‌య్య‌` అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని ఓ కీల‌క పాత్ర కోసం మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ని ద‌ర్శ‌కుడు బాబి సంప్ర‌దించార‌ట‌. గ‌తంలో ర‌వితేజ న‌టించిన `ప‌వ‌ర్` మూవీతో బాబి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

ఆ చ‌నువుతో `వాల్తేరు వీర‌య్య‌` మూవీలో కీల‌క పాత్ర‌ని చేయ‌మ‌ని రిక్వెస్ట్ చేయ‌డం, అన్న‌య్య సినిమా కావ‌డంతో మాస్ రాజా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలిసింది. జ‌న‌వ‌రి 26న ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అధికారికంగా మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు.
Tags:    

Similar News