• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకుడికి హ్యాండ్ ఇచ్చిన...

దర్శకుడికి హ్యాండ్ ఇచ్చిన మాస్ హీరో

By - Tupaki Desk
Update: 2019-09-02 09:16 GMT
ఇండస్ట్రీ లోపల జరిగే కథలు వింతలు మాములుగా ఉండవు. అనిష్చితికి మారుపేరుగా నిలిచే ఇక్కడి వ్యక్తుల మనస్తత్వాలు ఒకోసారి కొందరి విలువైన టైంని జీవితాన్ని పణంగా పెట్టేసుకుంటాయి. ఇదీ అలాంటి కథే. అతనో కుర్ర డైరెక్టర్. గత ఏడాది ఓ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. యూత్ ని టార్గెట్ చేసి ప్రేమలోని మరో కోణాన్ని హీరోయిన్ పాత్ర ద్వారా నెగటివ్ గా చూపించిన తీరుకు బాక్స్ ఆఫీస్ సక్సెస్ దక్కింది . దీంతో ఈ దర్శకుడి డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కాని తాను నమ్మిన కథకు తగ్గ ఆర్టిస్టులు దొరికినప్పుడే సినిమా చేయాలనీ నిర్ణయించుకుని ఆ మేరకు మరో స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు. తొలుత ఓ ఇద్దరు ముగ్గురు హీరోలను ట్రై చేశాడు కాని కుదరలేదు. ఆఖరికి మాస్ మార్కెట్ లో మంచి ఇమేజ్ ఉన్న ఓ హీరోని పట్టాడు . అతనికి ఇతని వర్క్ నచ్చింది. కథ బ్రహ్మాండం అన్నాడు. నిర్మాత కూడా రెడీ అయ్యాడు. కట్ చేస్తే ఇంకో నెల రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా రెమ్యునరేషన్ దగ్గర ఆ హీరో ఏకంగా `14 కోట్లు డిమాండ్ చేయడంతో షాక్ తిన్న నిర్మాత నావల్ల కాదని తప్పుకోవడంతో ఈ దర్శకుడు షాక్ తిన్నాడు.

గత ఏడాది మూడు దారుణమైన డిజాస్టర్లు ఉన్న ఈ మాస్ హీరో ఇప్పుడు ఇంత డిమాండ్ చేయడం చూసి నోటమాట రాలేదు. అంతేకాదు కథలో కూడా చాలా మార్పులు అడిగాడట. దీంతో చిర్రెత్తుకొచ్చిన దర్శకుడు ఈ హీరోతో మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడట. సదరు హీరో మంచి కథలను ఇలా పారితోషికం పేరిట కథలో మార్పుల పేరిట పోగొట్టుకోవడం వల్లే సరైన జడ్జ్ మెంట్ లేక దెబ్బ తింటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. షూటింగ్ లో ఆ హీరో మరో చిత్రం ఇలాంటి కారణాల వల్లే ఆలస్యమవుతూ ఫైనల్ గా డిసెంబర్ ను లాక్ చేసుకుంది


Tags:    
  • Mass Hero 
  • Director 
  • Telugu FIlm Industry 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS