కేన్స్ మతిపోగొట్టిన సినిమా విడుదలవుతోంది
గుర్తుండే ఉంటుంది.. రెండు నెలల కిందట జరిగిన కేన్స్ చిత్రోత్సవాల్లో ఏం జరిగిందో. అక్కడ మసాన్ అనే ఇండియన్ సినిమా ప్రదర్శన ఆరంభమైనపుడు జనాలకు పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ప్రసిద్ధ నటీనటులెవరరూ నటించలేదు. దర్శకుడు కూడా కొత్తవాడు. ఏదో షో వేస్తున్నారు చూద్దాంలే అన్నట్లు వీక్షకులంతా ఆసీనులయ్యారు. కానీ రెండు గంటల ఆ సినిమా చూశాక ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం మేకర్స్ చాలామందికి మతి పోయింది. అంత గొప్పగా ఉందా సినిమా. సినిమా ముగిసి లైట్లు వేయగానే ఆపకుండా ఐదు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ తో చప్పట్లు కొట్టి ఈ సినిమా మేకర్స్ ను అభినందించారు కేన్స్ అతిథులు. బహుశా ఏ భారతీయ సినిమాకు కూడా కేన్స్ లో ఇలాంటి గౌరవం దక్కి ఉండదు. ఆ సినిమానే.. మసాన్.
రిచా చద్దా, వికక్కీ కౌశల్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘మసాన్’. ఈ సినిమా కథ చాలా చిత్రంగా ఉంటుంది. దేవి అనే విద్యార్థిని తన బాయ్ ఫ్రెండుతో కలిసి హోటల్ గదిలో ఉండగా రైడ్ చేసి పట్టుకుంటారు పోలీసులు. దేవిని వీడియో తీసిన పోలీస్ ఆమె తండ్రిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఐతే దేవికి తాను చేసింది పెద్ద తప్పుగా అనిపించదు. మరోవైపు శ్మశానంలో శవాలు కాల్చే దీపక్ అనే కుర్రాడుంటాడు. అతడికిష్టం లేకపోయినా కుటుంబ ఆనవాయితీ ప్రకారం ఆ పనిలో కొనసాగుతుంటాడు. అతను ఓ డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ రెండు కథలకు సంబంధం ఏంటి? దేవి, దీపక్ ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్న కథతో ‘మసన్’ తీశాడు నీరజ్ ఘైవాన్ అనే కొత్త దర్శకుడు. శుక్రవారం విడుదలవుతోందీ సినిమా. కేన్స్ అతిథుల్ని అంతగా మెస్మరైజ్ చేసిందంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ లుక్కేయాల్సిందే.