ఆ విషయంలో 'జేమ్స్ కామెరూన్' మామూలోడు కాదు...

సినిమా కోసం ఏదైనా చేయగలిగే దర్శకులు కొందరు మాత్రమే ఉంటారు. వాళ్ళు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు.

Update: 2026-10-27 09:24 GMT

సినిమా కోసం ఏదైనా చేయగలిగే దర్శకులు కొందరు మాత్రమే ఉంటారు. వాళ్ళు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. తమ మైండ్ లో ఏదైతే ఉంటుందో దానిని విజువల్ గా స్క్రీన్ మీదకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తెలుగులో 'రాజమౌళి' ని ఆ కోవ కి చెందిన దర్శకుడి గా చెప్పుకోవచ్చు. కానీ హాలీవుడ్ ఫిల్మేకర్ అయిన 'జేమ్స్ కామెరూన్' సినిమా కోసం తన ప్రాణం పెట్టి వర్క్ చేస్తుంటాడు. అందుకే అతని సినిమాలు ఆస్కార్ అవార్డులను అందుకుంటాయి. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటాయి.

కామెరూన్ సినిమా కోసం ఏం చేశాడు...

1989 వ సంవత్సరంలో వచ్చిన 'ది అబిస్' మూవీ కోసం సముద్రం లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ గా ఈ షాట్స్ ను తీయలేమనే నిర్ణయానికి వచ్చేసిన కామెరూన్ 'న్యూక్లియర్ కూలింగ్ టవర్' ను కొన్నాడు. అందులో 28.4 మిలియన్ లీటర్ల వాటర్ ను నింపేసి ఒక 5 నెలల పాటు తన ఆర్టిస్టులందరితో కలిసి వాటర్ లో ఉండే సన్నివేశాలను ఎలా షూట్ చేయాలనే విషయం మీద రీసెర్చ్ చేశాడు. వాటర్ లోని సన్నివేశాలు తీయడానికి లైటింగ్ సరిగ్గా రావడం లేదని తన సినిమాటోగ్రాఫర్ కి చెప్పి అతని సహాయంతో 'హెచ్ఎంఐ అండర్ వాటర్ లైటింగ్' అనే టెక్నాలజీ నే తయారు చేయించాడు. ఇలా చేయడం వల్ల నీటిలో తీసిన విజువల్ కూడా హై క్వాలిటీ తో ది బెస్ట్ కలర్ కరెక్షన్ తో వచ్చాయి...

ఆ తర్వాత ఈ టెక్నాలజీ ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' (NASA) తన ట్రైనింగ్ కోర్సు లో వాడారు. అలాగే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ వాళ్ళు సముద్ర అంతర్భాగ డాక్యూమెంటరీల కోసం వాడుకున్నారు... ఇలా తన సినిమా కోసం తయారు చేసుకున్న టెక్నాలజీ అంతరిక్ష సైన్స్ రంగాలకు ఉపయోగపడిందంటే ఆయన విజన్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత కూడా ఇతర రంగాల వాళ్ళకి ఉపయోగ పడ్డాయంటే కామెరూన్ ఎలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు... ఒక డైనమిక్ ప్యాషనెట్ ఫిలిం మేకర్ ఎలా ఉంటాడో కామెరూన్ ను చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది... సినిమా అంటే అంత ఇష్టం ఉంది కాబట్టే ఆయన తన కెరియర్ లో టైటానిక్, అవతార్ లాంటి ప్రపంచం మెచ్చిన సినిమాలు తీశాడు.

Tags:    

Similar News