'డోరతి' మూవీ అంత ప్రత్యేకం గా నిలవడానికి ఇవే కారణమా?

రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా అత్యధిక వ్యూయర్ షిప్ ను సంపాదిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది.

Update: 2026-10-27 09:31 GMT

'జిగర్తాండ' మూవీతో ప్రేక్షకుల మన్ననలు పొందిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు... గత సంవత్సరం చేసిన 'రెట్రో' మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఈ ఇయర్ 'డోరతి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు... తమిళ్లో ఈ సినిమాకి మంచి స్పందన రావడంతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా అత్యధిక వ్యూయర్ షిప్ ను సంపాదిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది.

కార్తీక్ సుబ్బరాజు మ్యాజిక్

కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు పర్లేదు ఒకే అనిపిస్తాయి. కానీ ఇంకొన్ని సినిమాలు మనం ఖాళీగా ఉనప్పుడు, నిద్రపోవడానికి ముందు గుర్తుకు వస్తాయి. అందులోని సన్నివేశాలు ప్రతి క్షణం మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి కోవకి చెందినదే డోరతి. 80 - 90స్ మధ్య ఉండే వాతావరణాన్ని అప్పటి ప్రజల మనస్తత్వాన్ని వాళ్ల మధ్య ఉండే కోపాలు తాపాలు, మగాళ్ల ఆధిపత్యాన్ని, కులాల మధ్య ఉండే వైరుధ్యాన్ని చాలా చక్కగా చూపించారు. కార్తీ, సుబ్బు అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య రా అండ్ రాస్ట్రీక్ సన్నివేశాలను చాలా బాగా చూపించారు. డోరతి (కీర్తి సురేష్) వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ లు ఎలా మారిపోయాయి. ముఖ్యంగా సుబ్బు తీసుకున్న ఒక డేరింగ్ డిసీజన్ వల్ల ఆయన కెరియర్ ఎలా మారింది. తన కోసం ప్రాణం ఇచ్చే కార్తీ (ఫ్రెండ్) తన ప్రాణం తీయడానికి ఎందుకు ప్రయత్నించాడు.

ఆ రెండు క్యారెక్టర్లు పడే మదన చూస్తుంటే ప్రేక్షకుడి కండ్లల్లో నీళ్ళు తిరుగుతాయి. డైరెక్టర్ ఆ రెండు పాత్రల మధ్య ఏర్పరిచిన బాండింగ్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది. కార్తీక్ సుబ్బా రాజు మేకింగ్ తో సినిమాలో డెప్త్ క్రియేట్ చేశాడు. ఒకప్పటి రోజులను గుర్తు చేశాడు. ఆయన వాడిన కలర్ టోన్ ఆ పరిస్థితులకు బాగా సెట్ అయింది. సెకండాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ సన్నివేశం సినిమా రేంజ్ ను పెంచే విధంగా ఉంది. ఆయన వాడిన వైడ్ షాట్స్ ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో బాగా హెల్ప్ అయింది. అలాగే కార్తీ క్యారెక్టర్ కి సుబ్బు మీద కలిగే జాలి అతను మనిషే కదా అనే ఫీలింగ్ రావడానికి రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకుడిని నిదానం గా సినిమా లో ఇన్వాల్వ్ చేస్తాయి...

క్లైమాక్స్ గుర్తుండిపోతుందా...

అబ్బాయి గా ఉన్న సుబ్బు అమ్మాయి గా మారి 'డోరతి' అనే పేరు తో తను అనుకున్న లైఫ్ ను గడపాలనుకుంటాడు. అప్పటి దాకా బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న సుబ్బు ను కార్తీ అసహ్యించుకొని ఆ తర్వాత ఆయన మీద తనకి ఉన్నది ప్రేమ అని గుర్తించి క్లైమాక్స్ లో అతన్ని కలుసుకోవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సినిమా చూస్తున్నంత సేపు ఓకే అనిపించింది. మూవీ చూసి ఇంటికి వచ్చాక ఆ క్యారెక్టర్లు కథ తప్పకుండా మనల్ని వెంటాడుతుంది. నిజంగా సినిమాలో ఏదో ఒక తెలియని వెలితి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుడిని వెంటాడే ఇలాంటి సినిమా రాలేదనే చెప్పాలి. ఇవన్నీ కలిసి డోరతి ని స్పెషల్ మూవీ గా నిలిపాయి. ఫైనల్ గా ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంశలు దక్కుతున్నాయి...

Tags:    

Similar News