ఓటర్ కార్డ్ పై క్లారిటీ ఇచ్చిన మంచుమనోజ్

Update: 2019-07-18 05:08 GMT
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే నటుల్లో మంచు మనోజ్ ఒకరు. కానీ కొద్దిరోజులుగా ఆయన పేరు మీడియాలోనూ గట్టిగానే వినిపిస్తోంది. దానికి కారణం ఆయన ఓటు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలో ఉండడమే.. మీడియాలో కొద్దిరోజులుగా ఇదే వైరల్ గా మారింది. దీనిపై మంచు మనోజ్ తాజాగా వివరణ ఇచ్చారు.

అయితే తాజాగా ట్విట్టర్ లో పిచ్చాపాటిగా అభిమానులతో మాట్లాడిన మంచు మనోజ్ నారాయణ ఖేడ్ లో తనకు ఓటు హక్కు కల్పించడంపై స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తన ఓటరు ఐడీ నకిలీదని వివరణ ఇచ్చారు.

మీడియాలో వస్తున్నట్టు నారాయణ ఖేడ్ లో తాను ఓటు హక్కు నమోదు చేసుకోలేదని.. అది తప్పుగా అధికారులు ముద్రించారని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. తనకు హైదరాబాద్ లోని ఫిలింనగర్ చిరునామాతో ఓటరుకార్డ్ ఉందని.. అదే అసలైనదని వివరణ ఇచ్చాడు.

సంగారెడ్డిలో తన పేరిట నమోదైన నకిలీ ఓటరు గుర్తింపు కార్డ్ ను తొలగించాలని సంగారెడ్డి ఎన్నికల అధికారులకు, టీఆర్ ఎస్ నాయకులను మంచు మనోజ్ కోరారు. నాకు ఫిలింనగర్ లో తప్ప ఎక్కడా ఐడీ కార్డు లేదని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి నకిలీ కార్డులని మంచు స్పష్టం చేశారు. నకిలీ ఐడీ కార్డులను తొలగించాలని అధికారులను కోరారు.


Tags:    

Similar News