• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేపాల్ దేశానికి వత్తాసు...

నేపాల్ దేశానికి వత్తాసు పలికి..వివాదంలో ఇరుక్కున్న స్టార్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-05-21 08:11 GMT
నటి మనీషా కొయిరాలా సరిహద్దుల విషయంలో నేపాల్ ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వచ్చింది. అందులో మూడు భారతీయ ప్రాంతాలు లిపులేఖ్, కలపాణి మరియు లింపియాధూరలు మా దేశానికి సొంతం అంటూ తెలిపింది. నేపాల్ దేశ సంతతికి చెందిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా.. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గయావాలి ట్విట్టర్ పోస్టుకు సమాధానమిస్తూ.. నేపాల్ దేశ పటంలో లిపులేఖ్, కలపాణి, లింపియాధూరలను ప్రకటించిన నేపథ్యంలో మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతంగా, గౌరవప్రదమైన సంభాషణలు జరగాలని నటి తన ట్విట్టర్ పోస్ట్‌లో భారత్, నేపాల్, చైనా దేశాల గురించి ప్రస్తావించింది. ఈ సందర్బంగా "మా చిన్న దేశం యొక్క గౌరవాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతంగా.. గౌరవప్రదమైన సంప్రదింపులు జరగాలని అందరం ఎదురుచూస్తున్నాము" అని ఆమె ట్వీట్ చేసింది.

మే 18న నేపాల్ కేబినెట్.. ఆ దేశ భూభాగాల పరిధిలోకి లిపులేఖ్, కలపాణి, లింపియాధూరలను కలిపి చెప్పుకొని ఆమోదించిన మ్యాప్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం పై మంగళవారం, నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఒలి 'ఆ మూడు భూభాగాలు నేపాల్ దేశానికి చెందినవని నొక్కిచెప్పి.. రాజకీయంగా అయినా.. దౌత్య ప్రయత్నాల ద్వారా అయినా భారతదేశం నుండి ఆ మూడు ప్రాంతాలను తిరిగి పొందాలని' ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ విషయంలో నెటిజన్లు మనీషా పై ఫైర్‌ అవుతున్నారు. నెటిజన్‌లు స్పందిస్తూ ‘ మనీషా బేటా నువ్వు మనసుతో ఆలోచించూ లేక పోతే నిశ్శబ్దంగా ఉండూ.. అనవసరంగా దీనిని రాజకీయం చెయ్యొద్దు. మీరు నేపాల్ తరపున ఉన్నారు. మీ ప్రేమను అణచుకుంటే మంచిది.. లేదా  నువ్వు ముంబాయిలో సంపాదించింది మొత్తం పోతుంది’ అని ట్వీట్‌ చేస్తున్నారు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ మనీషాని ట్రోల్‌ చేస్తున్నారు.
Tags:    
  • Manisha Koirala 
  • Nepal 
  • India 
  • Nepal Vs India 
  • Manisha Koirala Tweet On Lipulekh Controversey 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS