హైపర్ కోసం ఆయన ఎనర్జీ కూడా

Update: 2016-09-28 07:30 GMT
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. నేను శైలజతో సక్సెస్ రూట్ పట్టిన రామ్.. ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఇది. తనకు కందిరీగ లాంటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో కలిసి రామ్ చేస్తున్న హైపర్ పై చాలానే అంచనాలు ఉన్నాయి.

సరిగ్గా సినిమా రిలీజ్ కి మూడు రోజులు ఉందనగా.. హైపర్ కి సంబంధించిన ఓ సూపర్ అప్ డేట్ చెప్పాడు రామ్. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గిబ్రాన్ ఇచ్చిన పాటలు మోత మోగించేస్తున్నాయ్ కూడా. ప్రతీ పాటా దేనికదే ఆకట్టుకుంటూ శ్రోతలకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడీ హైపర్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను.. మెలోడీ బ్రహ్మగా పేరు గడించిన మణిశర్మ అందించాడంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు రామ్.

బీజీఎం విషయంలో మణిశర్మను మించినోడు లేడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు వేరే సంగీత దర్శకుడు ఉన్నా.. మణితో బ్యాక్ గ్రౌండ్ చేయించుకుంటారు. రీసెంట్ గా నాని జెంటిల్మన్ కు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ ఎంతగా ప్లస్ అయిందో చూశాం. ఇప్పుడు హైపర్ కోసం మణిశర్మ కూడా తన ఎనర్జీ అందించాడనే న్యూస్ తెలియడంతో.. అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News