• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మణిరత్నం ఆఫీస్ కు బాంబు...

మణిరత్నం ఆఫీస్ కు బాంబు బెదిరింపు!

By - Tupaki Desk
Update: 2018-10-02 08:26 GMT
ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌ గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. తాజాగా మ‌ణి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం`న‌వాబ్` త‌మిళ‌నాట ఘ‌న విజ‌యం సాధించింది. టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ హిట్ టాక్ తో మంచి కలెక్ష‌న్ల‌ను రాబడుతోంది. ఈ సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మ‌ణిర‌త్నానికి ఓ అజ్ఞాత వ్య‌క్తి షాకిచ్చాడు. `న‌వాబ్` సినిమాలో కొన్ని అభ్యంతరకర డైలాగ్ లను తొలగించాలంటూ ఓ అగంతకుడు మణిరత్నం ఆఫీస్ కు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. మైలాపూర్ లోని కేశ‌వ పెరుమాల్ కోవిల్ వీధిలో ఉన్న మణి ఆఫీస్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ ఆ వ్య‌క్తి ఫోన్ లో సోమ‌వారం రాత్రి బెదించినట్టుగా మణి ఆఫీసు సిబ్బంది వెల్లడించారు.

దీంతో, పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ఆ ఆఫీసులో బాంబు స్కాడ్ తో త‌నిఖీలు నిర్వ‌హించారు. అక్క‌డ బాంబు దొర‌క‌క‌పోవ‌డంతో అది ఫేక్ కాల్ అని గుర్తించారు. న‌వాబ్ సినిమాలో జాల‌ర్ల‌కు సంబంధించి కొన్ని డైలాగులు ఉన్నాయ‌ని, వాటిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఆ బెదిరింపు కాల్ వ‌చ్చింద‌ని కోలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలోని కొన్ని డైలాగులు జాల‌ర్ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉన్నాయ‌ని వారు ఆరోపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ణి ఆఫీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో మ‌ణి ఆఫీసుకు పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించారు. ఆ ఫోన్ కాల్ ఎక్క‌డ‌నుంచి వ‌చ్చింది, చేసిన వ్య‌క్తి ఎవ‌రు అని క‌నిపెట్టేందుకు పోలీసులు విచార‌ణ చేపట్టారు.  

Tags:    
  • Mani Ratnam 
  • Chennai Office 
  • Bomb Threat 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS