'శైలజారెడ్డి అల్లుడు' కోసం మంగ్లీ పాట..

Update: 2018-08-14 09:10 GMT

గోపి సుందర్.. కొత్తగా దూసుకొస్తున్న ఈ యువ సంగీత సంచలనం ప్రయోగాలతో సక్సెస్ అవుతున్నాడు. మంచి పాటలను శ్రోతలకు అందిస్తూ అలరిస్తున్నాడు. గోపి సుందర్ సంగీత దర్శకత్వంలో  విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’ మూవీలోని పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.. వినూత్న గొంతు గల గాయకులను తెలుగు తెరకు పరిచయం చేస్తూ వారితో అద్భుతమైన పాటలను పాడిస్తున్నాడు.

ఇప్పుడు మరో తెలంగాణ గాయనికి గోపి సుందర్ అవకాశం ఇచ్చాడు. నాగచైతన్య హీరోగా రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ మూవీలో శైలజారెడ్డి అల్లుడు చూడు అనే ఫోక్ సాంగ్ ను  మంగ్లీతో పాడిస్తున్నారు. అత్త రమ్యక్రిష్ణ - ప్రియురాలు అను ఇమ్మాన్యుయేల్ మధ్యన నలిగిపోయే నాగచైతన్య పరిస్థితిపై బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఈ పాటను 16న విడుదల చేసేందుకు సిద్ధం చేశారు.

మంగ్లీ తెలంగాణ జానపద గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఓ న్యూస్ చానెల్ తో వివిధ కార్యక్రమాల్లో ఆర్టిస్టుగా అలరించింది. తనదైన స్వరంతో యూట్యూబ్ చానెల్స్ కు వివిధ పండుగల సందర్భంగా రూపొందించే పాటలకు పాడుతూ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు తొలిసారి సినిమాలో అవకాశం దక్కడంతో మంగ్లీ దశ తిరిగినట్టే కనిపిస్తోంది.
Tags:    

Similar News