హాలీవుడ్ నటుడు 'ది రాక్' నుంచి ప్రేరణ పొందుతున్న మంచు విష్ణు..!

Update: 2020-11-26 04:00 GMT
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు విష్ణు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి బాటలోనే నడుస్తూ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం రెండు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఇప్పటికే వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో 'మోసగాళ్లు' సినిమా పూర్తి చేశాడు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో కలిసి మరోసారి ఢీ కొట్టడానికి రెడీ అయ్యాడు విష్ణు. 'ఢీ' వంటి సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ గా 'డి అండ్ డి - డబుల్ డోస్' అనే సినిమాతో వస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం కోసం మంచు విష్ణు కఠోర వ్యాయామాలు చేస్తూ బాడీ ని రెడీ చేస్తున్నాడు.

దీని కోసం 'ది రాక్' గా పిలవబడే హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ నుండి ప్రేరణ పొందుతున్నానని మంచు హీరో వెల్లడించారు. తాజాగా విష్ణు తన కూతురు ఆర్య మంచు తో కలిసి ఉన్న ఓ పిక్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 'నా స్నేహితులు నన్ను బీస్ట్ అని పిలుస్తారు. కానీ ఈ చిన్నదానితో నేను జెంటిల్ మ్యాన్ బీస్ట్. డి అండ్ డి కోసం వర్క్ ఔట్ చేస్తున్నారు. ఈ పిక్ తీసుకోడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన రాక్ కి ధన్యవాదాలు' అని విష్ణు పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో తన కూతురిని ఎత్తుకున్న విష్ణు.. షర్ట్ లేకుండా తన మాచో బాడీని చూపిస్తున్నాడు. దీనికి ఆర్య మంచు క్లాప్స్ కొడుతూ కనిపిస్తోంది. 'డి అండ్ డి' కోసం మంచు హీరో రెస్ట్ లేకుండా శ్రమిస్తున్నాడని ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది. కాగా, పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’తో పోలిస్తే... డబుల్‌ కామెడీ మరియు యాక్షన్‌ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. అవరమ్‌ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Tags:    

Similar News