వెబ్ సిరీస్ నుంచి సినిమాగా మార్చారా?

Update: 2018-05-24 23:30 GMT
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా కెరీర్ ని చక్కబెట్టుకోవాలంటే దైర్యం గట్టిగా ఉండాలి. దానితో పాటు ఓపిక కూడా ఉండాలి. ఆ విషయాల్లో మంచు ఫ్యామిలి చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి. హీరోలు ఎవరి స్టైల్ లో వారి సినిమాలు చేస్తుండగా నటిగా యాంకర్ గా నిర్మాతగా మంచు లక్ష్మి కూడా తనదైన శైలిలో టాలెంట్ నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. త్వరలోనే మంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

చివరగా 2015 లో దొంగాట సినిమాలో కనిపించిన మంచు లక్ష్మి రియాలిటీ షోలను ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. వైఫ్ ఆఫ్ రామ్ కథను మొదట వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేశారు. మళ్లీ ఏమైందో గాని థియేటర్స్ లో చూడాలని సడన్ ట్విస్ట్ ఇచ్చారు. సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సమయం ఎక్కువగానే తీసుకున్నప్పటికీ ఫస్ట్ లుక్ లో పెద్దగా ఇంపాక్ట్ ఏమి కనిపించడం లేదు. మంచు లక్ష్మి రామ్ అనే వ్యక్తి భార్య గా కనిపించనున్నారు.

ఇక ఆదర్శ్ బాలకృష్ణ - సామ్రాట్ రెడ్డి అలాగే ప్రియదర్శి ప్రముఖ నటులు సినిమాలో నటించారు. విజయ్ యెలకంటి సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రఘు దీక్షిత్ టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక వెబ్ సిరీస్ నుంచి సినిమాకు మళ్ళిన ఈ కథ సంగతి పై ఇంకా టెక్నీషియన్స్ సమాధానం ఇవ్వలేదు. మంచి లక్ష్మి అండ్ పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న వైఫ్ ఆఫ్ రామ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News