• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచు ఫ్యాన్స్ మనసంతా...

మంచు ఫ్యాన్స్ మనసంతా 'సన్నాఫ్ ఇండియా'పైనే!

By - Tupaki Desk
Update: 2021-06-27 01:30 GMT
తెలుగు తెరకు నిండుదనాన్ని .. పండుగదనాన్ని తెచ్చిన కథానాయకులలో మోహన్ బాబు ఒకరు. పవర్ఫుల్ విలన్ గా .. కామెడీ టచ్ ఉన్న విలన్ గా .. హీరోగా ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కాదు. మోహన్ బాబు హైటు .. ఆయన నడక .. డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఏ పాత్రను పోషించినా ఆ పాత్రపై తనదైన ముద్ర వేయడం మోహన్ బాబుకు అలవాటు. ఎంత వేగంగా డైలాగ్ చెప్పినా అది ఆడియన్స్ కి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం మోహన్ బాబు ప్రత్యేకత.

అలాంటి మోహన్ బాబు కథానాయకుడిగానే అయినా తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. 'రౌడీ' .. 'గాయత్రి' వంటి సినిమాలు చూస్తే, మోహన్ బాబు నటనలో వాడి .. వేడి ఇంకా ఎంతమాత్రం తగ్గలేదనే విషయం అర్థమవుతుంది. ఆయన చూపుల్లోని పదునులో .. డైలాగ్ డెలివరీలోని పవర్లో ఇప్పటికీ మార్పు లేదనిపిస్తుంది. ఈ రెండు సినిమాల్లోను ఆయన డిఫరెంట్ లుక్స్ తోనే కనిపించారు .. తనదైన స్టైల్ తోనే మెప్పించారు. తాను కథానాయకుడిగా ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోతున్నారు.

మోహన్ బాబు తాజా చిత్రంగా 'సన్నాఫ్ ఇండియా' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోను మోహన్ బాబు కొత్త లుక్ తో కనిపించనున్నారు. టైటిల్ ను బట్టే ఈ కథ .. మోహన్ బాబు పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటాయనేది అర్థమైపోతోంది.
ఆయన పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయనే విషయం ఇటీవల వదిలిన లిరికల్ వీడియో వలన స్పష్టమవుతోంది. డైమండ్ రత్నబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం, ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆయనకి తప్పకుండ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Son Of India 
  • Mohan Babu 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS