• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలరిస్తోన్న జాయ్ ఫుల్...

అలరిస్తోన్న జాయ్ ఫుల్ 'మంచి రోజులు వచ్చాయి' టైటిల్ సాంగ్..!

By - Tupaki Desk
Update: 2021-10-26 05:54 GMT
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్ తాజాగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

ఇప్పటి వరకు ''మంచి రోజులు వచ్చాయి'' చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన టైటిల్ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. 'చీకటిలో ఉన్నా.. దారే లేకున్నా.. నీకై నువ్వు తోడై ఉండి లే త్వరగా.. బలమే లేకున్నా.. బాధే అవుతున్నా.. ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా' అంటూ మోటివేట్ చేసే లిరిక్స్ తో ఈ పాట సాగింది.

'మంచి రోజులు వచ్చాయి' సాంగ్ కు అనూప్ రూబెన్స్ ట్యూన్ సమకూర్చారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హరి చరణ్ - శ్రావణి కలిసి వినసొంపుగా ఆలపించారు. ఈ జాయ్ ఫుల్ సాంగ్ లో హీరోహీరోయిన్లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం అంతా కనిపిస్తున్నారు. కరోనా సమయంలోనూ సందడి వాతావరణంలో ఈ పాట చిత్రీకరణ జరిపినట్లు లిరికల్ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

'మంచి రోజులు వచ్చాయి' చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ - రజిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ - SKN నిర్మాతలుగా వ్యవహరించారు.


Full View
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 
  • Manchi Rojulochaie Title Song 

Similar News

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

Copyright @2026

Powered by Blink CMS