• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సో సో గా' సాంగ్: 'మంచి...

'సో సో గా' సాంగ్: 'మంచి రోజులు వచ్చాయి' చిత్రంలోని మంచి మెలోడీ..!

By - Tupaki Desk
Update: 2021-08-16 06:14 GMT
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ''మంచి రోజులు వచ్చాయి''. 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ క్యారెక్టర్స్ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ - క్యారక్టర్స్ ఇంట్రో లుక్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల వదిలిన సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో 'సో సోగా' అనే సాంగ్ లిరికల్ వీడియోని సుప్రీమ్ హీరో సాయి తేజ్ తాజాగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు.


'సో సోగా ఉన్నానని.. సో స్పెషలే చేసావులే.. సోలోగా నేను బోరై ఉంటే.. చిన్ని బేబీ.. ముద్దు బేబీ.. లవ్లీ బేబీ..' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. 'ఒకటే ఒకటేలే నువ్వు నేనూ ఒకటలే.. తనువులు రెండైనా.. ఊపిరి ఒకటేలే..' అంటూ ప్రియుడు తన ప్రేయసి మీదున్న ప్రేమను వ్యక్త పరుస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ దీనికి బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. యంగ్ సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ చేశారు. లిరిసిస్ట్ కె.కె ఈ గీతానికి మంచి సాహిత్యం అందించారు.

'సో సోగా' పాట విజువల్ గా కూడా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో సంతోష్ శోభన్ - మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. అలానే సంతోష్ వేసే డ్యాన్స్ మూవ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. సాయి శ్రీరామ్ దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. UV కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా 'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ మరియు SKN నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Full View


Tags:    
  • Manchi Rojulochaie 
  • Manchi Rojulochaie teaser 
  • Santhosh Shoban Manchi Rojulochaie 
  • Manchi Rojulochaie songs 
  • So So Ga song 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS