మలయాళ ఛానల్ లో అలాంటి పోల్స్?

Update: 2016-11-10 11:30 GMT
ప్రేమమ్.. మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా సంచలనం సృష్టించిన మూవీ ఇది. ఎన్నో విమర్శలను ఎదుర్కున్నా.. చివరకు సూపర్ హిట్ గా నిలవడం అంటే సాధారణ విషయం కాదు. అసలు ఈ సినిమాకు ముందు నుంచి ఒరిజినల్ వెర్షన్ తో పోలిక పెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పుడు ఓ ఛానల్ ఏకంగా పోల్ నిర్వహిస్తోంది. మలయాళ వెర్షన్ లో సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ను.. తెలుగు వెర్షన్ లో శృతి హాసన్ చేసిన డ్యాన్స్ ను పోల్చుతూ.. రెండింటిలో ఏది బెస్ట్ అని ఓటేయాలట! అసలు కామెడీ అంటే ఇదే. ఇదేమన్నా నేషనల్ లెవల్ పోల్ కాదు కదా.. జస్ట్ ఓ రీజనల్ ఛానల్ పోల్ నిర్వహిస్తే.. ఆటోమేటిగ్గా తమ భాషలోని సినిమాకే ఓట్లు పడతాయి. ఈ విషయం తెలిసినా.. కేవలం తెలుగు వెర్షన్ ను తక్కువ చేసి చూపించడానికే ఇలాంటి పోల్ నిర్వహించారని చెప్పచ్చు.

కేవలం ఆ థీమ్ కు సరిపడేలా.. వేసిన డ్యాన్స్ తప్ప.. నిజంగా శృతి హాసన్ తో డ్యాన్స్ చేయగలిగే కెపాసిటీ సాయి పల్లవికి లేదనే విషయం మర్చిపోకూడదు. శృతి సూపర్బ్ క్లాసికల్ డ్యాన్సర్ అనే విషయం తెలిసే... ఈ పోలింగ్ పెట్టి ఉంటే.. నిజంగా అంతకంటే అమాయకత్వం ఉండదమో.. మరో సినిమా ఇండస్ట్రీని కించపరుస్తూ.. ఈ ఛానల్ పెట్టిన పోల్ పై విమర్శలు ఎక్కువవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News