నేల టికెట్ భామకు మెగా ఆఫర్ వచ్చిందిగా!

Update: 2019-05-27 05:39 GMT
మెగా హీరో సాయి తేజ్ గత కొంతకాలంగా వరస ఫెయిల్యూర్లతో సతమతమయ్యాడు. అయితే రీసెంట్ గా 'చిత్రలహరి' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. 'చిత్రలహరి' సూపర్ డూపర్ హిట్ కాదు కానీ మెగా హీరోకైతే పెద్ద రిలీఫ్ ఇచ్చింది. దీంతో సాయి తేజ్ రెట్టించిన ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు.
 
ఎంటర్ టైనర్ చిత్రాలను మలచడంలో స్పెషలిస్ట్ అయిన మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ నెక్స్ట్ సినిమా ఉంటుంది.  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా ముంబై బ్యూటీ మాళవిక శర్మను ఎంపిక చేశారట.  మాళవిక శర్మ గతంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'నేల టికెట్' సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మాళవికకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది.  ఏదైతేనేం.. ఇప్పుడు ఏకంగా గీతా ఆర్ట్స్ లో అవకాశం సాధించింది. 

ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాను జూన్ 20 న ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రావు రమేష్ ఒక కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.


Tags:    

Similar News