కామెడీ చేస్తున్న ఎవడే భామ

Update: 2017-04-04 05:05 GMT
టాలీవుడ్ లో ఎవడే సుబ్రమణ్యం.. కళ్యాణ వైభోగమే చిత్రాలలో నటించిన భామ మాళవికా నాయర్. రెండు సినిమాల్లోను మాళవిక యాక్టింగ్ కు బోలెడంత గుర్తింపు ప్రశంశలు దక్కాయి. ఆ తర్వాత అవకాశాలు వరుసగా వచ్చేసినా సరే.. ఈ భామ మాత్రం సినిమాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందర పడలేదు.

ఇప్పుడీ చిన్నది ఓ తమిళ సినిమాకి సైన్ చేయడమే కాదు.. ఇప్పటికే మూవీ షూటింగ్ ప్రారంభించేసింది కూడా. 'అరసియాల్ల ఇదెల్లాం సాధారణమప్పా' అనేది మూవీ టైటిల్. రాజకీయాల్లో ఇవన్నీ కామన్.. అని దీని అర్ధం. రాజతాందిరం ఫేమ్ వీర బాహు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక నాయర్.. మూవీ అంతా బోలెడంత కామెడీ చేస్తుందట. అసలీ చిత్రం మొత్తం ఫన్ బేస్డ్ గానే సాగనుంది. కొత్త దర్శకుడు అవినాష్ హరిహరన్ ఈ మూవీలని తెరకెక్కించనున్నాడు.

అయితే.. మాళవికా నాయర్ కేరక్టర్ కొత్తగా ఉండడమే కాదు.. ఈ భామ లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండనుందట. అంతగా మేకోవర్ చేసి మరీ ఈ సినిమా చేస్తోందట. ఏడాది పాటు ఏ సినిమాను ఒప్పుకోకుండా ఉండడానికి కూడా ఇదే రీజన్ అంటున్నారు. మరోవైపు ఈమె మళ్లీ యాక్టింగ్ లోకి దిగడంతో తెలుగు సినిమాల నుంచి ఆఫర్స్ వెళుతున్నాయ్ కానీ.. సైన్ చేయడంలో మాత్రం బాగా సెలెక్టివ్ గా ఉందీ భామ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News