• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ డేట్ కోసం...

రిలీజ్ డేట్ కోసం కొట్టుకుంటున్న 'లవ్ స్టోరీ' - 'టక్ జగదీష్'..?

By - Tupaki Desk
Update: 2021-07-15 23:30 GMT
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా సమ్మర్ లో విడుదల కావాల్సిన అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తుండటంతో మళ్ళీ టాలీవుడ్ సినిమాన్నీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అలానే కిరణ్ అబ్బవరం 'SR కల్యాణ మండపం' - కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి 'ముగ్గురు మొనగాళ్ళు' చిత్రాలను ఆగస్టు 6వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఇప్పుడు నాగ చైతన్య 'లవ్ స్టోరీ'- నాని 'టక్ జగదీష్' సినిమాలను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 13 కోసం పోటీ పడుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇండిపెండెన్స్ డే వీక్ ని క్యాష్ చేసుకోవాలని ఆ డేట్ ని 'పుష్ప' లాక్ చేసి పెట్టుకుంది. అయితే ఇప్పుడు చెప్పిన తేదీకి రిలీజ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ తేదీ కోసం చైతన్య - నాని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకముందు ఏప్రిల్‌ లో విడుదల తేదీల కోసం కూడా 'లవ్ స్టొరీ' 'టక్ జగదీష్' చిత్రాలు ఇలానే పోటీ పడ్డాయి. చివరకు ఏప్రిల్ 16న నాగచైతన్య.. ఏప్రిల్ 23న నాని వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడటంతో ఇప్పుడు ఆగస్ట్ నెలలో రావాలని చూస్తున్నారు. అయితే నాని సినిమాని జూలై 30న రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇంత షార్ట్ గ్యాప్ లో 'టక్ జగదీష్' ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

ఒకవేళ 'టక్ జగదీష్' సినిమా ఈ నెలాఖరున వస్తే.. 'లవ్ స్టోరీ' చిత్రానికి ఆగస్ట్ 13న సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల విడుదల పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. 'లవ్ స్టోరీ' చిత్రంలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చగా.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. 'ఫిదా' తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ ''లవ్ స్టొరీ'' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరోవైపు 'టక్ జగదీష్' చిత్రంలో నాని సరసన రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ శివ నిర్వాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా 'టక్ జగదీష్' పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Tags:    
  • Naga Chaitanya 
  • Love Story 
  • Nani 
  • Tuck Jagadish 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS