• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారీ ధరకు అమ్ముడుపోయిన...

భారీ ధరకు అమ్ముడుపోయిన 'మేజర్' హిందీ శాటిలైట్ రైట్స్..!

By - Tupaki Desk
Update: 2021-07-02 05:24 GMT
టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మేజర్''. 'గూఢచారి' ఫేమ్ శ‌శి కిర‌ణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు - హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'మేజర్' ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మరియు శాటిలైట్ హక్కుల కోసం ఫాన్సీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'మేజర్' ఓవర్ సీస్ రైట్స్ మంచి ధరలకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో హిందీ శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'మేజర్' సినిమా ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందుతోంది. భారతీయ ప్రేక్షకులు దేశభక్తి థీమ్ తో వచ్చే చిత్రాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తుంటారు. ఇప్పుడు 'మేజర్' కూడా దేశభక్తి ని చాటిచెప్పే యూనివర్సల్ థీమ్ తో వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించింది.

తెలుగు సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉండటం కూడా ఈ సినిమా హిందీ శాటిలైట్ బిజినెస్ భారీగా జరగడానికి మరొక కారణమని చెప్పవచ్చు. ఏదేమైనా 'మేజర్' మూవీ థియేట్రికల్ విడుదలకు ముందే అన్ని రైట్స్ క్లోజ్ అవుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. దీనికి అడవి శేష్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.

'మేజర్' చిత్రంలో శోభితా దూళిపాళ్ల - సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ''మేజర్'' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెలలోనే తిరిగి షూటింగ్ ప్రారంభమించి పెండింగ్ వర్క్ ఫినిష్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా తదుపరి విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Major Hindi Satellite Rights 
  • Adivi Sesh Major 
  • Sashi Kiran Tikka 
  • Major movie 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS