• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాను రానంటూనే ...సూప‌ర్...

రాను రానంటూనే ...సూప‌ర్ స్టార్ వెర్ష‌న్!

By - Tupaki Desk
Update: 2022-07-13 08:30 GMT
సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిన ద‌గ్గ‌రి నుంచి నెటిజ‌న్ ల క్రియేటివిటీ తారా స్థాయికి చేరింది. ఏ చిన్న వీడియో వ‌చ్చినా దాన్ని త‌మ‌దైన స్టైల్లో ఎడిట్ చేసి వావ్ అనిపించేస్తున్నారు. అలా చేసిన వీడియోతో 'కేజీఎఫ్ 2' కు ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్‌ని సొంతం చేసుకున్నాడు 19 ఏళ్ల ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి. ఈ మూవీకి ఉత్వ‌ల్ చేసిన ఎడిటింగ్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత 'బాహుబ‌లి 2' సినిమా మొత్తాన్ని ఓ నెటిజ‌న్ 2 నిమిషాల నిడివిగ‌ల టీజ‌ర్ ల చూపించి అబ్బుర‌ప‌రిచాడు.

ఇదే త‌ర‌హాలో ఓ నెటిజ‌న్ నితిన్ సినిమా పాట‌ని ఎడిట్ చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ డాన్స్ కు మ్యాచ్ చేసిన తీరు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌హేష్ స్టెప్పుల‌కు క‌రెక్ట్ గా సింక్ కావ‌డంతో ఈ వీడియో ప్ర‌స్తుతం మ‌హేష్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్నయాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'. ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ ఫుల్ పాత్ర‌లో క‌లెక్ట‌ర్ గా నితిన్ న‌టిస్తు్న మూవీ ఇది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ ఎటాక్ ఈ మూవీపై అంచ‌నాల్ని పెంచేశాయి. తాజాగా విడుద‌ల చేసిన స్పెష‌ల్ సాంగ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తోంది.  'రారా రెడ్డీ.. ఐ యామ్ రెడీ'.. అంటూ సాగే ఈ సాంగ్ కు మాసీవ్ స్టెప్పుల‌తో నితిన్‌, అంజ‌లి అద‌ర‌గొట్టేశారు.

జాత‌ర సెట్ లో షూట్ చేసిన ఈ సాంగ్ కు అంజ‌లి గ్లామ‌ర్‌, హీరో నితిన్ మాసీవ్ స్టెప్పులు ప్ర‌ధాన ఆక‌ర్ణ‌ణ‌గా నిలిచాయి. మ‌హతి స్వ‌ర సాగ‌ర్ అందించిన సంగీతం కూడా మ‌రో లెవెల్లో వుండి పాట‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

నెట్టింట సంద‌డి చేస్తున్న ఈ పాట ఇప్ప‌డు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఈ పాట చివ‌ర్లో 'జయం' మూవీలో పాపులర్ సాంగ్ గా నిలిచిన 'రాను రానంటూనే చిన్న‌దో' అంటూ సాగే ప‌దాల్ని చేర్చారు. దీంతో ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో మ‌రింత వైర‌ల్ గా మారింది.

ఇదిలా వుంటే ఓ నెటిజ‌న్ ఈ పాట‌ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ న‌టించిన 'స‌ర్కారు వారి పాట‌' చిత్రంలోని 'మ మ మ‌హేశా' అంటూ సాగే సాంగ్ కి మ్యాచ్‌ చేశాడు. 'మ మ మ‌హేశా' సాంగ్ లో మ‌హేష్ మాసీవ్ డాన్స్ తో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. ఈ వీడియోకు  'రాను రానంటూనే చిన్న‌దో' అంటూ సాగే ఆడియోని ఓ నెటిజ‌న్ క‌రెక్ట్ గా సింక్ చేసి ఎడిట్ చేశాడు. దీన్నే నెట్టింట షేర్ చేశాడు. ఈ పాట‌ని చూసిన అభిమానులు అదుర్స్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ నెట్టింట వైర‌ల్ గా మారింది.


Video Here>> https://youtube.com/shorts/-D7sf-q24ns?feature=share
Tags:    
  • TollywoodFilms 
  • KGFChapter2 
  • Bahubali 
  • UjwalKulkarni 
  • Maheshbabu 
  • SarkaruVaariPata 
  • Nitin 
  • MacharlaNiyojakavargam 
  • Anjali 
  • JayamMovie 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS