స్పెయిన్ లో మహేష్ కు సర్జరీ.. దుబాయ్ లో విశ్రాంతి..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్పెయిన్ లో మహేష్ కు సర్జరీ పూర్తయినట్లు తెలుస్తోంది. అలానే మహేష్ అక్కడి నుంచి దుబాయ్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు మహేష్.. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో ఫిజియో థెరపీ చేయించుకున్నారట. అయితే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో చిన్న గాయం అవడంతో.. శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సలహా ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే సోమవారం స్పెయిన్ కు వెళ్లి సక్సెస్ ఫుల్ గా మోకాలికి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ దుబాయ్ వెళ్లి రెస్ట్ తీసుకోనున్నారు.
మహేష్ బాబు ఈసారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దుబాయ్ లో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే మహేష్ సతీమణి నమ్రత మహేష్ వెంట ఉండగా.. డిసెంబర్ 24న పిల్లలు గౌతమ్ - సితార దుబాయ్ కు వెళ్తారని తెలుస్తోంది.
ఇకపోతే మహేష్ బాబు మోకాలి శస్త్ర చికిత్స జరిగిందని కథనాలు వస్తుండటంతో సూపర్ స్టార్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని.. ఎప్పటిలానే రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
మహేష్ కు సర్జరీ జరగడంతో 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట.
'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. షూటింగ్ కాస్త లేట్ అయినా మహేష్ బాబు మోకాలు సర్జరీ సినిమాపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.