• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ - రాజమౌళి కాంబో...

మహేష్ - రాజమౌళి కాంబో వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందంట..!

By - Tupaki Desk
Update: 2020-04-18 17:30 GMT
టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపుగా అందరు స్టార్ డైరెక్టర్లతో పనిచేసాడు ఒక్క రాజమౌళి తో తప్ప. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో అన్న ఊహలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. దీనికి తోడు సూపర్ స్టార్ - రాజమౌళి కాంబోలో సినిమా అంటూ సినీ ఇండస్ట్రీలో ఈ మాట వింటూనే ఉంటాం. ఈ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి కానీ ఈ కాంబోలో సినిమా మాత్రం సెట్ కాలేదు. ఈ న్యూస్ వచ్చిన ప్రతిసారి సినీ అభిమానులు ఎంతో ఆనందపడుతుంటారు. వెంటనే అది నిజం కాదని తెలిసి నీరుగారి పోతుంటారు. ప్రతిసారి మహేష్ - రాజమౌళి వారి తదుపరి చిత్రాలను వేరే వాళ్లతో ప్రకటించి అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. గత కొన్ని ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది.

మ‌హేష్ - రాజ‌మౌళి కాంబోలో సినిమా చూడాల‌ని తెలుగు చిత్ర‌సీమ క‌ల‌లు కంటోంది. వీరిద్ద‌రినీ వారి కాంబోలో సినిమా గురించి ఎప్పుడు అడిగినా అతి త్వ‌ర‌లో అంటూ స‌మాధానం దాటవేస్తూ వస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది అందరిలోనూ ఒక ఆలోచన ఉంది. ఆయన ప్రభాస్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తారు అని కొందరు అంటే.. మరి కొంతమంది మాత్రం రాజమౌళి మహాభారతం చేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దీనిపైన స్పందిస్తూ ఇందులో పెద్ద సృష్టి రహస్యం ఏమీ లేదని.. ఎప్పటినుంచో అనుకున్నదే.. మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా ఉంటుందని.. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై కే.ఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లుగా రాజమౌళి సింపుల్ గా చెప్పేశాడట. మహేష్ 27వ సినిమా.. రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సూపర్ స్టార్ - రాజమౌళి సినిమా న్యూస్ విన్న సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఎన్నాళ్ళ నుండో వేచిన తరుణం వచ్చేసిందని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారట. కొంతమంది ఫ్యాన్స్ ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారట. కారణం తమ అభిమాన హీరోతో సినిమా ఉంటుందని భావించిన ఇతర హీరోల ఫ్యాన్స్ కి ఈ వార్త పెద్ద షాక్ ఇచ్చిందంట. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. రోజూ రాజమౌళి నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఉంటుందని న్యూస్ వస్తున్న టైములో జక్కన్న మహేష్ తో సినిమా కన్ఫర్మ్ చేయడం వారికి బాధ కలిగించిందట. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ కూడా తమ హీరోతో రాజమౌళి సినిమా ఉంటుందని వెయిట్ చేస్తుంటే ఇప్పుడు సడన్ గా మహేష్ బాబుతో సినిమా ప్రకటించడంతో అన్ హ్యాపీగా ఉన్నారట. ఈ నేపథ్యంలో ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా వార్ స్టార్ట్ అయిందంట. సూపర్ స్టార్ - దర్శకధీరుడు కాంబోలో సినిమా ఉండబోతోందని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే ఇతర హీరోల ఫ్యాన్స్ అన్ హ్యాపీగా ఉన్నారని అర్థమైంది. అయినా రాజమౌళి.. మహేష్ తో సినిమా తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్తానని ఏమీ ప్రకటించలేదు కదా.. మహేష్ సినిమా తర్వాత తమ అభిమాన హీరోలతో జక్కన్న సినిమా ఉంటుందేమో.. అభిమానులు మీరు ఈ విధంగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Mahesh Babu 
  • Rajamoli 
  • Rajamouli-Mahesh Combo 
  • other hero fans reaction 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS