మహేష్ కూతురి టాలెంట్ చూశారా..?

Update: 2017-11-20 11:15 GMT
మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ ఫొటో కనిపించినా.. వీడియో కనిపించినా అవి వైరల్ అయిపోతాయి. ఆ మధ్య ‘స్పైడర్’ సినిమాలోని ఒక పాటను సితార వింటూ.. హమ్ చేస్తూ కార్లో వెళ్తున్న వీడియో ఎలా హల్ చల్ చేసిందో తెలిసిందే. తాజాగా సితారకు సంబంధించిన ఒక ఫొటో ఇలాగే వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో సితార చేతిలో ఒక అమ్మాయి బొమ్మ ఉంది. తాను ఎలాంటి డ్రెస్ వేసుకుందో.. అచ్చంగా అదే తరహా డ్రెస్ దాన్ని కూడా తన లాగే తయారు చేసింది సితార. ఈ ఫొటోలో చాలా క్యూట్ గా కనిపిస్తోంది సితార. ఇది చూసి సితార చేతిలో ఇంకో సితార అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫొటోను మహేష్ అభిమానులు షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.

మహేష్ కు తన కొడుకు కూతురు అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పిల్లలు పుట్టాక అతడిలో చాలా మార్పు వచ్చింది. వాళ్లతో కలిసి తరచుగా వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రిన్స్. వాళ్లు తన స్ట్రెస్ బస్టర్స్ అని మహేష్ చెబుతుంటాడు. తండ్రి బాటలో ఆల్రెడీ గౌతమ్ తెరంగేట్రం చేసేయగా.. సితార కూడా అదే బాటలో నడిచే అవకాశాలు లేకపోలేదు.
Tags:    

Similar News