పవన్ పై మహేష్ సెన్సేషనల్ కామెంట్స్

Update: 2017-08-27 13:45 GMT
మహేష్ అనగానే సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకోకండి. ఇక్కడ మాట్లాడుతున్నది ‘బిగ్ బాస్’ షోతో పాపులర్ అయిన కత్తి మహేష్ గురించి. ఇతగాడికి.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కొన్ని నెలల కిందటి నుంచే వైరం నడుస్తోంది. ‘కాటమరాయుడు’కు నెగెటివ్ రివ్యూ రాశాడంటూ ఆయన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేసుకున్నారు. ఐతే ఈ కత్తి కూడా తక్కువోడేమీ కాదు.

వాళ్ల హెచ్చరికలన్నింటినీ స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను ఇరుకున పెడుతున్నాడు. ‘బిగ్ బాస్’ షో నుంచి బయటికి వచ్చాక వరుస బెట్టి టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చేస్తూ తన పాపులారిటీ పెంచేసుకునే ప్రయత్నంలో ఉన్న మహేష్.. ఒక ఛానెల్లో పవన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానిపై పవన్ ఫ్యాన్స్ చెలరేగిపోయారు. కత్తి వాట్సాప్ నంబరుకి హేట్ మెసేజులు పంపించారు. అతను వాటిని కూడా ఫేస్ బుక్ పేజీలో పెట్టేశాడు.

ఇది చాలదన్నట్లు ఒక టీవీ ఛానెల్ మిడ్ నైట్ షోలో పవన్ అభిమానులతో ఫోన్ ఇన్ కు కూర్చున్నాడు. ఇక అక్కడ మొదలైంది అసలు రభస. పవన్ అభిమానులు ఇతణ్ని తిట్టిపోయడం.. అతను దీటుగా బదులివ్వడం.. ఇలా రంజుగా సాగింది ఈ ప్రోగ్రాం. ఈ సందర్భంగా పవన్ పై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కత్తి. పవన్ కు మాత్రమే ప్రశ్నించే హక్కుందా.. మాకు లేదా.. పవన్ మాత్రమే మంచి చేయడానికి వచ్చాడా మేమంతా ఊరికే కూర్చున్నామా అంటూ ప్రశ్నించాడు కత్తి. తాను పవన్ ను ఒక స్టార్ హీరోగా గౌరవిస్తానని.. ఐతే అతను గొప్ప నటుడని తాను పొగడనని అన్నాడు.
Read more!

తనకు మిగతా హీరోలు ఎలాగో పవన్ కూడా అంతేనని.. పవన్ తో తనకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని కత్తి స్పష్టం చేశాడు. తనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని.. ఏ అంశం మీదైనా తన అభిప్రాయాలు చెప్పే హక్కుందని కత్తి అన్నాడు. తాను తన అభిప్రాయం చెబుతుంటే పవన్ అభిమానులు బెదిరింపులకు దిగడం ఎంత వరకు సమంజసమని కత్తి ప్రశ్నించాడు. రోజు రోజుకూ కత్తి-పవన్ అభిమానుల మధ్య శ్రుతి మించుతున్న ఈ వార్ చూస్తుంటే.. చివరికి తమిళ స్టార్ హీరోలు విజయ్.. అజిత్ ల మాదిరి ఈ వ్యవహారంలో పవన్ జోక్యం చేసుకుని ఏదైనా ప్రకటన చేయాల్సిన అవసరమొస్తుందేమో అనిపిస్తోంది.
Tags:    

Similar News