ఆయనతో మహేష్ అనుబంధానికి 41 ఏళ్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు అంతర్ముఖుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరితోనూ పెద్దగా కలవడు. ఒకవేళ కలిసి వారితో సన్నిహితంగా మారాడంటే ఆ బంధాన్ని ఎన్నేళ్లయినా కొనసాగిస్తూ ఉంటాడు. మహేష్ కి అంత స్టార్ డం వచ్చినా, నుంచి తన వెంట టీం గా ఉన్న వాళ్ళని ఎవర్నీ మార్చు లేదంటే ఆశ్చర్యమనిపించక మానదు. మహేష్ ఇండియా లెవెల్ లో పెద్ద హీరో. ఆయన కోరుకుంటే ఇండియా లో పనిచేసే ఏ టెక్నీషియన్ ని అయినా పెట్టుకోవచ్చు. కానీ ఆయన మొదట్నుంచి ఎవరైతే ఆయన తన దగ్గర పని చేస్తున్నారో ఇప్పటికీ వారే పని చేస్తున్నారు. వాళ్లకి మహేష్ భరోసా ఇస్తున్నారు. సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ పట్టాభి ఇందుకు ఉదాహరణ. మహేష్ చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పట్టాభి ఆయనకు అప్పట్లో మేకప్ చేసేవారు. మహేష్ నటించిన అన్ని సినిమాలకు మేకప్ చేసింది పట్టాభే.
మహేష్ పెరిగి పెద్దయి రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైనా మేకప్ మెన్ ని మాత్రం మార్చలేదు. పట్టాభిని కొనసాగించాడు. మేకప్ వేయడం లో పట్టాభి ఎంతో సీనియర్. కానీ ఆయన ఎన్టీఆర్, కృష్ణ, రజినీకాంత్ తరానికి చెందిన మేకప్ మెన్. కాలం పరిస్థితులు మారి మేకప్ లో ఎన్ని మార్పులు వచ్చినా మహేష్ బాబు మాత్రం తనను నమ్ముకున్న వ్యక్తిని మాత్రం దూరం చేసుకోలేదు. ఇప్పటికీ మహేష్ బాబుకు పట్టాభే మేకప్ మెన్. మహేష్ బాబుది పట్టాభి 41 ఏళ్ల అనుబంధం. మహేష్ బాల నటుడి గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు పట్టాభి మేకప్ మెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పట్టాభి మహేష్ బాబు గురించి పలు విషయాలు పంచుకున్నారు.
'నేను సూపర్ స్టార్ కృష్ణ నటించిన వంద సినిమాలకు మేకప్ మెన్ గా పని చేశా. కృష్ణ గారు హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే మహేష్ బాబు బాల నటుడిగా పరిచయం అయ్యారు. మహేష్ బాబు నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమా నుంచి ఆయనకు నేనే మేకప్ వేయడం మొదలుపెట్టా. ఆ సినిమా ఒక్కటే కాదు బాల్యంలో మహేష్ నటించిన అన్ని సినిమాలకు మేకప్ చేసింది నేనే. మామూలు మేకప్ అయితే ఓకే కానీ.. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు మేకప్ వేయించుకునేందుకు మహేష్ మారాం చేసేవాడు. ముగ్గురు కొడుకులు మూవీ లో మహేష్ అల్లూరి వేషం వేయించాలని అనుకున్నారు. దీని కోసం ప్రత్యేకంగా విగ్ తయారు చేయించారు. ఈ విగ్ తయారీకి కొలతలు తీసుకోవడం ఎందుకు మహేష్ అస్సలు ఒప్పుకోలేదు చాలా మారం చేశారు. చివరికి బాగా బతిమిలాడి ఒప్పించు కోవాల్సి వచ్చింది. బాలచంద్రుడు అనే సినిమాలో కూడా మహేష్ బాబు కృష్ణుడిగా గెటప్ వేశారు. ఆ సమయంలో కూడా మహేష్ గారం చేశారు.
మహేష్ బాబు రాజకుమారుడు సినిమా తో హీరోగా పరిచయం అయ్యారు. అన్నేళ్ల తర్వాత కూడా తనను మళ్లీ మేకప్ మ్యాన్ గా పిలిచారు. మహేష్ బాబు సూపర్ స్టార్ గా అవతరిస్తాడని నాకు మొదటి నుంచీ నమ్మకం. మురారి విడుదలైన తర్వాత నా నమ్మకం మరింతగా బలపడింది. మహేష్ నన్ను సొంత మనిషిగా ఆదరిస్తారు. మా పాప నిహారిక కు పేరు పెట్టేందుకు స్వయంగా ఇంటికి వచ్చారు. నా కుమార్తె చదువుకు ఎంతో సహాయ పడ్డారు. మహేష్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.
మహేష్, నమ్రత అన్యోన్యమైన జంట. నమ్రత, పిల్లలు ఎప్పుడూ తన వెంటే ఉండాలని మహేష్ కోరుకుంటారు. ఒకవేళ ఎక్కువ రోజుల పాటు బయట ప్రాంతాల్లో షూటింగ్ కు వెళ్లాల్సి వస్తే ఇక గంటలతరబడి పిల్లలతో, నమ్రతతో మాట్లాడుతూ ఉంటారు. మహేష్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవర్నీ కోపగించుకోరు. ఒకవేళ ఎవరిపై నైనా కోపం వచ్చినా అది తన మీద నమ్రత మీద తీర్చుకుంటూ ఉంటారు. షూటింగ్ లేకపోతే ఎక్కువ ఇంట్లో ఉండేందుకు మహేష్ ప్రాధాన్యం ఇస్తుంటారు. వారితో కలసి బయటి ప్రాంతాలకు వెళుతుంటారు. మహేష్ కు దైవభక్తి కూడా చాలా ఎక్కువే. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు సాయిబాబా, వినాయకుడి విగ్రహాల కు కచ్చితంగా నమస్కరిస్తారు. షూటింగ్ లతో మహేష్ ఎంతో బిజీగా ఉంటే నమ్రత మాత్రం పిల్లల చదువులు, ఇంటి వ్యవహారాలు చక్కబెడుతుంటారు ' అని తెలిపారు.