పవన్ తో మహేష్ డైరెక్టర్ సినిమా..?
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరికను నెరవేర్చుకున్నారు. పవన్ కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' ను నిర్మించి మంచి భారీ విజయం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బ్యానర్ లో పవన్ తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. మంచి కథతో డైరెక్టర్ తో కలుస్తానని చెప్పి హీరోకి అడ్వాన్స్ కూడా అందజేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సరైన దర్శకుడి కోసం వెతుకుతున్న దిల్ రాజు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి ఈ బాధ్యత అప్పగించారట.
దిల్ రాజు బ్యానర్ లో 'మున్నా' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత 'బృందావనం' 'ఎవడు' 'మహర్షి' వంటి సినిమాలను అదే ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కించాడు. అయితే నేషనల్ అవార్డ్ సాధించిన 'మహర్షి' సినిమా తర్వాత ప్రాజెక్ట్ ఎంటనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దిల్ రాజు బ్యానర్ లోనే ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వంశీ పైడిపల్లి కి ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దిల్ రాజు - వంశీ పైడిపల్లి ఇద్దరూ పవన్ ని కలిసొచ్చారని తెలుస్తోంది. 'వకీల్ సాబ్' ని తన కాంపౌండ్ లోని వేణు శ్రీరామ్ అప్పగించిన దిల్ రాజు.. పవన్ తో చేయబోయే రెండో సినిమాని వంశీ చేతిలో పెట్టాడో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.