100 సినిమాలు చేసిన ఆయ‌న‌తో మ‌హేష్ అనుబంధ‌మిదీ!

Update: 2020-09-14 04:15 GMT
త‌న‌తో క‌లిసి వందో సినిమాకి ప‌ని చేస్తున్న లైన్ ప్రొడ్యూస‌ర్ గోపికృష్ణను సూప‌ర్ స్టార్ మహేష్ అభినందించారు. గోపికృష్ణ‌తో అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా మ‌హేష్ గుర్తు చేసుకున్నారు. సీనియర్ టాలీవుడ్ లైన్ ప్రొడ్యూసర్ కమ్ ఫారిన్ షూట్ కో ఆర్డినేటర్ గోపికృష్ణ నరవులా 100 సినిమాలు పూర్తి చేసినందుకు అభినంద‌న‌లు అంటూ ట్వీట్ చేశారు. సర్కారు వారి పాట ఆయ‌న‌కు గోపికృష్ణ 100 వ చిత్రం అని తెలుస్తోంది.

``ఇదంతా 1988 లో `బజార్ రౌడీ`తో ప్రారంభమైంది. మా మ‌ధ్య సినీ సోదరభావం ఉంది. కష్టపడి పనిచేసే  వృత్తికి అంకితమైన నిబ‌ద్ధ‌త ఉన్న మా కుటుంబ‌ సభ్యుడు ఆయ‌న‌. ఇన్ని సంవత్సరాలు అతనితో కలిసి పనిచేసినందుకు ఎన్నో  అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీకు ఎల్లప్పుడూ నా అభినంద‌న‌లు గోపి గారు.. శుభాకాంక్షలు`` అని గోపీకృష్ణతో త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

గతంలో గోపికృష్ణుడు మహేష్ నటించిన అనేక చిత్రాలలో పనిచేశారు. దూకుడు - భారత్ అనే నేను లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు క‌లిసి ప‌ని చేశారు. అల‌ వైకుంఠ‌పురములో ఆయన 99 వ చిత్రం. చిరంజీవి (సైరా- నరసింహారెడ్డి).. పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్.. అతారింటికి దారేది).. ఎన్టీఆర్ (నన్నకు ప్రేమతో) .. ప్రభాస్ (మిర్చి) వంటి చాలా మంది స్టార్ హీరోలతో కూడా పనిచేశారు. లైన్ ప్రొడ్యూస‌ర్ కం కోఆర్డినేట‌ర్ అంటే చాలా ఇంపార్టెంట్ ప‌నులు ఉంటాయి. విదేశాల్లో లొకేష‌న్ కోఆర్డినేష‌న్ అంటే ఎంత హార్డ్ గా శ్ర‌మించాలో తెలిసిన‌దే. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న గోపికృష్ణ ప్ర‌తిదీ సులువుగా సాల్వ్ చేస్తార‌న్న టాక్ ప‌రిశ్ర‌మ‌లో ఉంది.
Tags:    

Similar News