మహేష్‌ రాక కోసం త్రివిక్రమ్‌ కోసం వెయిటింగ్‌..!

Update: 2022-07-03 06:30 GMT
సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి వారాలు దాటి నెలలు గడుస్తున్నాయి. అయినా ఇప్పటి వరకు దర్శకుడు త్రివిక్రమ్‌ తో మహేష్‌ బాబు చేయాల్సిన సినిమా మొదలు అవ్వలేదు. అదుగో ఇదుగో అంటూ సినిమా ను వాయిదా వేస్తూ వస్తున్నారు. మొదట అనుకున్న ప్రకారం సర్కారు వారి పాట సినిమా తో పాటు సమాంతరంగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది.

రెండు సినిమాలు ఒకే సమయంలో చేయడం వల్ల డేట్లు ఇతర విషయాల్లో ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశ్యం తో పాటు కరోనా కారణంగా కూడా SSMB28 ఆలస్యం అయ్యింది. సరే సర్కారు వారి పాట విడుదల అయిన తర్వాత అయినా వెంటనే SSMB28  ప్రారంభం అవుతుంది అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇప్పటి వరకు మహేష్ బాబుకు దర్శకుడు త్రివిక్రమ్‌ ఫైనల్‌ స్క్రిప్ట్‌ నరేషన్ ఇవ్వలేదట.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ ఇప్పుడు అమెరికా లో ఉన్న మహేష్‌ బాబు కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ ల భేటీ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉన్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు అమెరికా నుండి వచ్చిన వెంటనే త్రివిక్రమ్‌ ఫైనల్‌ నరేషన్ ఇవ్వబోతున్నాడు.

చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే పూర్తి చేసి ఈ నెల చివర్లో లేదా ఆగస్టు లో షూటింగ్‌ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఎప్పుడు ప్రారంభం అయినా కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ముగించి వచ్చే సమ్మర్‌ కు సినిమా ను తీసుకు వచ్చేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నారు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు కమర్షియల్‌ గా సక్సెస్ అవ్వకున్నా కూడా బుల్లి తెరపై ఇప్పటికి కూడా సందడి చేస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ లతో జోరు మీదున్న ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌ సినిమా తో ఖచ్చితంగా ఈసారి కమర్షియల్‌ హిట్‌ ను మహేష్ బాబు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News