మహేష్ - త్రివిక్రమ్.. మళ్ళీ ఏమైందో?
టాలీవుడ్ పవర్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటైన మహేష్ బాబు త్రివిక్రమ్ తదుపరి సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అతడు ఖలేజా సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వీరు సినిమా చేస్తున్నారు. అయితే ఈ కలయిక లో వచ్చే సినిమా ఎలా ఉంటుంది? అసలు మహేష్ బాబును త్రివిక్రమ్ మళ్లీ ఇంకా ఏ తరహాలో చూపిస్తాడు అనే విషయంపై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
ఎందుకంటే మహేష్ బాబును అతడు సినిమాలో త్రివిక్రమ్ చూపించినట్లుగా ఎవరూ చూపించలేదు. ఆ తరువాత ఖలేజా సినిమాలో పూర్తిగా మహేష్ బాబు ను ఎంటర్టైన్మెంట్ రోల్ చూపించాడు. ఇక ఈసారి ఎలా చూపిస్తాడా అని ఓ వర్గం ప్రేక్షకులలో ఆ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ సినిమాపై గత ఏడాది నుంచి చర్చలు జరుపుతూనే ఉన్నాడు.
అసలైతే త్రివిక్రమ్ అల..వైకుంఠపురములో సినిమా అనంతరం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను పాన్ ఇండియా ఆలోచనల్లో పడి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ ఓకే అవడానికి కూడా చాలా సమయం పట్టింది. మహేష్ బాబు స్టోరీ మాత్రమే బాగుంది అని చెప్పాడు. కానీ స్క్రిప్టు విషయంలో మాత్రం మధ్యలో చాలా సార్లు మార్పులు చేర్పులు చేయాలని అడిగాడు.
అయితే ఫైనల్ స్క్రిప్ట్ కూడా దాదాపు అయింది కానీ మహేష్ బాబు ఇంకా ఏదో అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అతన్ని పూర్తిస్థాయిలో సినిమాకు సిద్ధం చేయాలని త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఒక షూటింగ్ మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఫ్లోలో కూడా కొన్ని సన్నివేశాలను మారుస్తూ ఉంటాడు. కానీ మహేష్ బాబుకు అది ఇష్టం లేదట.
పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ మొదట చెప్పింది చెప్పినట్లు గానే సినిమాలో ఉండేలా ముందే ప్లాన్ చేసుకోవాలి అని అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ ను ఒప్పించేందుకు త్రివిక్రమ్ ఇటీవల ఇటలీ వెళ్ళినట్లు సమాచారం. మహేష్ బాబు అక్కడ గత కొన్ని రోజులుగా హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి మహేష్ బాబు ఎలాంటి నిర్ణయం తో ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడో చూడాలి.