త్రివిక్రమ్ పై మహేష్ ఒత్తిడి దేనికోసమట?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం `సర్కార్ వారి పాట` మిశ్రమ స్పందనలతో మొదలైనా చక్కని ఆరంభ వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికి తగ్గుదల కనిపించిందన్న టాక్ ట్రేడ్ లో వినిపిస్తోంది. ఇంతలోనే మహేష్ తన తదుపరి చిత్రాలకు కార్యచరణను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. జూలై లో త్రివిక్రమ్‌తో తన కొత్త సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారని సమాచారం.
అంతేకాదు.. రిలీజ్ కి ఒక డెడ్ లైన్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఈ సినిమాని 2013 సంక్రాంతికి విడుదల చేయాలని మహేష్ భావిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో ప్రతిసారీ మహేష్ కి విజయమే కానీ అపజయం అరుదు. అందుకే ఈ డేట్ ని లాక్ చేయాలని భావిస్తున్నారట. కానీ త్రివిక్రమ్ చెప్పిన టైమ్ కి సినిమాని పూర్తి చేస్తేనే ఇది పాజిబుల్. కరోనా క్రైసిస్ ముప్పు ఇప్పట్లో లేదు కాబట్టి ఇకపై సినిమాల షూటింగులకు ఇబ్బందులేవీ లేవు. స్వతహాగానే స్టార్ డైరెక్టర్ తన సినిమాలను షూట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు కాబట్టి సంక్రాంతి బరిలోకి అందిస్తాడా? అన్నదే ఇప్పుడు డిబేటబుల్ గా మారింది.
కానీ మహేష్ మాత్రం టైమ్ తీసుకునే మూడ్ లో లేడు. తదుపరి వెంటనే తన పాన్ ఇండియా మూవీని ప్రారంభించే ఆలోచనతో ఉన్నాడు. అందుకు రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ బృందం స్క్రిప్టును కూడా లాక్ చేసేస్తోందనే గుసగుస వినిపిస్తోంది. ఇక ఒక్కసారి రాజమౌళి సినిమాకి వెళితే వచ్చే రెండేళ్లు కచ్చితంగా ఇక తీరిక అన్నది ఉండదు. వేరే సినిమా ఏదీ చేయలేదు. కాబట్టి రాజమౌళితో మహేష్ షెడ్యూళ్లకు అనుగుణంగా త్రివిక్రమ్ వేగంగా తన సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. తదుపరి ప్రణాళికల దృష్ట్యా .. 2023 వేసవిలోపు కనీసం ఒక్క సినిమా అయినా కావాలని త్రివిక్రమ్‌పై మహేష్ ఒత్తిడి తెచ్చాడని గుసగుస వినిపిస్తోంది.