MB27 ప్లాన్ ఛేంజ్.. మ‌హేష్ సెట్స్ కి?

Update: 2020-02-05 04:12 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ అనంత‌రం ఫ్యామిలీతో క‌లిసి అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో మ‌హేష్ ఫ్యామిలీ షికార్లు చేసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో గౌత‌మ్ - సీతా పాప సంద‌డి తెలిసిందే. ఫ్యామిలీకి కావాల్సినంత స‌మ‌యాన్ని కేటాయించి అమెరికా చుట్టేసాడు. ఆ క్ర‌మంలోనే మ‌హేష్ మోకాలికి శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌నుంద‌ని.. దానివ‌ల్ల‌ దాదాపు ఐదు నెల‌లు పాటు విశ్రాంతి తీసుకుంటార‌ని ప్ర‌చార‌మైంది.

ఐదు నెల‌ల త‌ర్వాత‌నే మ‌హ‌ష్ తిరిగి వ‌చ్చాక పైడిప‌ల్లి సినిమాని ప్రారంభిస్తార‌ని ప్ర‌చారమైంది. చికిత్స అనంత‌రం కోలుకున్నాకే సెట్స్ కొస్తార‌న్న ముచ్చ‌టా సాగింది. అయితే తాజ‌గా సూప‌ర్ స్టార్ నేడు కుటంబంతో క‌లిసి హైద‌రాబాద్ లో ల్యాండ్ అయిపోతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. టూర్ ముగించి...ఇక మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అవ్వ‌డం కోసమే రిట‌ర్న్ అవుతున్నార‌న్న చ‌ర్చా సాగుతోంది. మ‌రి ఐదు నెల‌ల టూర్ ప్లాన్ అనేది మ‌ధ్య‌లో ఛేంజ్ అయిందా? లేక ముందుగా వేసుకున్న షూడ్యూల్ ప్ర‌కార‌మే ఇలా చేస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇంత‌కీ మ‌హేష్ మోకాలి శ‌స్త్ర చికిత్స జ‌రిగిందా లేదా? అన్న‌దానికి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక మ‌హేష్ తిరిగొచ్చేస్తున్నారు కాబ‌ట్టి వంశీ పైడిప‌ల్లి అన్ని అస్త్రాల‌తో రెడీగా ఉండ‌టమే ఆల‌స్యం. హైద‌రాబాద్ లో కొద్దిరోజుల‌ విశ్రాంతి అనంత‌రం మంచి రోజు చూసుకుని సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసే వీలుంద‌ట‌. రానున్న‌ది స‌మ్మ‌ర్ కాబ‌ట్టి ఎండ తీవ్ర‌త‌ను బ‌ట్టి మ‌హేష్ షూటింగ్ కి కాల్షీట్లు కేటాయించే అవ‌కాశం ఉంది. ఈ గ్యాప్ లో కొత్త స్క్రిప్టుల్ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కొన్ని రోజులుగా మ‌హేష్.. త‌న‌ తండ్రి గారైన‌ కృష్ణ కోసం రెగ్యుల‌ర్ గా కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నాడు. ప్ర‌తి రోజు సాయంత్రం కృష్ణ‌ తో కొంత స‌మంయాన్ని గ‌డిపి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News