3నెలలో బుర్రిపాలెం బుల్లోడిగా మహేష్

Update: 2015-08-17 02:05 GMT
సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు రెండవ వారంలో కూడా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కధలో కంటెంట్ వుంటే ఖాతాలో విజయం ఆటోమేటిక్ గా వస్తుందని శ్రీమంతుడు టీమ్ మరోసారి నిరువుపించిది. ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపధ్యంలో మహేష్ ఈరోజు ప్రెస్ తో ముచ్చటించి ధన్యవాదాలు తెలిపారు.

శ్రీమంతుడు సినిమా విడుదలైన నాటినుండీ వినిపిస్తున్న వాదన ఏమిటంటే సినిమాలో చెప్పినట్టుగా నిజ జీవితంలో మహేష్ ఏ గ్రామాన్ని  నైనా దత్తత తీసుకుంటాడా లేదా అని. దీనికి సమాధానం ఈరోజు వెల్లడించాడు. మహేష్ తన తండ్రి కృష్ణ గారి సొంత ఊరైన బుర్రిపాలాన్ని దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించాడు. మరో రెండు మూడు నెలలో తన బావ జయదేవ్ తో కలిసి వ్యవహారాలన్నిటినీ చూసుకుంటాడనే సమాచారం.

శ్రీమంతుడు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ 4 ప్లేస్ లో నిలిచి మహేష్ అభిమానులను సంతృప్తిపరిచింది. కొరటాల కధాకధనానికి, మహేష్ నటన తోడవడంతో సినిమా ఒక మంచి జ్ఞాపకంగా మారింది.   
Tags:    

Similar News