• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రావిపూడిని అలా టీజ్ చేసిన...

రావిపూడిని అలా టీజ్ చేసిన మహేష్!

By - Tupaki Desk
Update: 2020-01-10 07:06 GMT
'సరిలేరు నీకెవ్వరు' తో తొలిసారిగా అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. సినిమా ప్రోమోస్ చూస్తుంటే అనిల్ ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకున్నాడనే అనిపిస్తోంది. చాలారోజుల తర్వాత మహేష్ ను మాస్ అవతారంలో చూపిస్తుండడంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

మహేష్ బాబుతో కలిసి పనిచేయడం మరిచి పోలేని అనుభవం అని చెప్పిన అనిల్ షూటింగ్ సమయంలో మహేష్ తో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించారు. అనిల్ కు కోపం వస్తే ఇతరులపై అరవడం.. కేకలు పెట్టడం లాంటివి చేయరట. దానికి బదులుగా కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఏదో ఒకటి తింటారట. పాజిటివ్ గా ఉండాలనే ఉద్దేశంలో ఇలా చేస్తానని తెలిపారు. అయితే ఈ విషయం మహేష్ గారు గమనించారని.. అప్పటి నుంచి ఈ విషయంపై తనను సరదాగా ఏడిపిస్తూ ఉండేవారని అన్నారు. మహేష్ తో పని చెయ్యడం ఏ దర్శకుడికైనా సంతోషం ఇస్తుందని తనకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే మహేష్ కూడా అనిల్ రావిపూడి వర్క్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో అనిల్ తో మరోసారి కలిసి పనిచేసే ఆలోచన ఉందని కూడా చెప్పుకొచ్చారు. మహేష్ ఈమధ్య చేసిన సినిమాలు గమనిస్తే దాదాపుగా దర్శకులను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈలెక్కన మహేష్-అనిల్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టే.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Sarileru Neekevvaru Teaser 
  • Mahesh Babu Dialouges In Sarileru Neekevvaru 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Rashmika Mandanna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS