ముగించేవరకూ మహేష్ దూకుడు
వరుసగా రెండు పరాజయాలు రావడంతో తన మరుసటి చిత్రంపై మహేష్ బాబు చాలానే పట్టుదలగా ఉన్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్న సూపర్ స్టార్.. స్పైడర్ విడుదలకు ముందే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసేశాడు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి టార్గెట్ తో స్టార్ట్ చేసినా.. ఇప్పుడు సమ్మర్ కు షెడ్యూల్ చేశారు.
గత నెలలో తమిళనాడులో వరుస షూటింగులు జరుపుకోగా.. ఇప్పుడు హైద్రాబాద్ లో కొత్త షెడ్యూల్ కు ముహూర్తం ఖాయమైంది. ఈ నెల 7నుంచి లేటెస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారట.సినిమాలోని కీలక నటీనటులు అందరూ పాల్గొనబోతుండగా.. పలు కీలక సన్నివేశాలతో పాటు.. రెండు పాటలు.. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ తో దాదాపుగా షూటింగ్ పూర్తయిపోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి సెకండాఫ్ నుంచి మహేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే ప్రణాళికలు కూడా ఉన్నాయని టాక్.
భరత్ అనే నేను టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ మూవీ 2.ఓ ను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటన రావడంతో.. ముందుగా చెప్పినట్లుగా ఏప్రిల్ 27కే మహేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నిర్మాత నుంచి మరోసారి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.