గోలీకాయలు ఉంటే మగోడు కాదట.. 'జో జో' బోల్డ్ హెచ్చరిక
రాయలసీమలోని వజ్రాల వేటకు కేరాఫ్ అడ్రస్ అయిన జొన్నగిరి నేపథ్యంలో సాగే ప్రయాణంతో ఈ టీజర్ హైలెట్ అయ్యింది.
"గమనిక.. మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి" అంటూ స్టార్టింగ్‌లోనే ఒక పచ్చి వార్నింగ్ కార్డు వేసి మరీ వదిలిన 'జో జో' కాషన్.2 టీజర్ ఇప్పుడు నెట్టింట సౌండ్ చేసేలానే ఉంది. సీనియర్ డైరెక్టర్ దేవా కట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ రా, రస్టిక్ రొమాంటిక్ చిత్రం నుంచి వచ్చిన వీడియో పక్కా రాయలసీమ నేటివిటీతో యూత్‌ను టార్గెట్ చేస్తోంది.
రాయలసీమలోని వజ్రాల వేటకు కేరాఫ్ అడ్రస్ అయిన జొన్నగిరి నేపథ్యంలో సాగే ప్రయాణంతో ఈ టీజర్ హైలెట్ అయ్యింది. అయితే అసలైన కిక్ ఇచ్చేది మాత్రం రాత్రి పూట హీరో, హీరోయిన్ల మధ్య నడిచే డైలాగ్ ఎపిసోడ్. "మగోనివేనా నువ్వు?" అని హీరోయిన్ స్ట్రెయిట్ గా అడగడం.. దానికి హీరో బిత్తరపోయి "ఏందట్లా అడుగుతుండావు.. కానొస్తా లేదా?" అని ప్రశ్నించడం సీన్లోని బోల్డ్‌నెస్‌ను అమాంతం పెంచేసింది.
దానికి హీరోయిన్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో ఇన్ స్టంట్ గా వైరల్ అయ్యేలా ఉంది. "కింద గోలీకాయలు ఉన్నటోడల్లా మగోడే అనుకుంటాడు.. గుండెకాయ కూడా ఉందా అని!" అంటూ డైలాగ్ రాయలసీమ యాసలో ఎంత బోల్డ్ గా ఉందో, అంతే ఆలోచింపజేసేలా ఉంది. పడుచుపిల్ల కనిపిస్తే నాలుగు రోజులు వెంటపడి పని కానిచ్చుకుని పారిపోయే రకమా, లేక కష్టాల్లో ఉన్న పిల్లను జీవితాంతం మోసేంత దమ్మున్న మొగోడివా అంటూ ఆమె అడిగే ప్రశ్న క్యారెక్టర్ లోని డెప్త్ ను ఎలివేట్ చేసింది.
హీరో కూడా తగ్గకుండా తనదైన రాయలసీమ యాసలో కౌంటర్ ఇచ్చాడు. "ఒకసారి మాటిచ్చానంటే మడమ తిప్పని వంశం మాది.. బాలేబాబు టైపు" అంటూ తలపై చేయి వేసుకుని చెప్పిన తీరు థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉంది. కృష్ణ కమల్, మాహి జంటగా నటించిన ఈ చిత్రంలో రొటీన్ లవ్ ట్రాక్ కాకుండా, చాలా ప్రాక్టికల్ అండ్ రా రిలేషన్ షిప్ ను తెరపై చూపిస్తున్నారని అర్థమవుతోంది.
విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మించిన ఈ చిత్రానికి రోహిత్ కుమార్ కెమెరా పనితనం పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా చూపించింది. అలాగే మహేష్ శంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ డ్రామాలోని మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. 'ప్రస్థానం' లాంటి కల్ట్ క్లాసిక్ అందించిన దేవా కట్టా పేరు ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండటంతో కంటెంట్ లో ఖచ్చితంగా ఏదో గట్టి విషయం ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.
ఎలాంటి ఫిల్టర్లు లేకుండా సహజమైన భాష, బోల్డ్ క్యారెక్టరైజేషన్లతో వస్తున్న 'జో జో' టీజర్ ప్రస్తుతానికి మంచి బజ్ తెచ్చేలా ఉంది. ఇలాంటి రా కంటెంట్ కు సోషల్ మీడియాలో యూత్ నుంచి రెస్పాన్స్ రావచ్చు. మరి టీజర్లో చూపించిన ఈ ఘాటుతనం, ఇంటెన్సిటీ పూర్తి సినిమాలో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.