సమ్మర్ హాలీడేస్ : 'వెంకీ మూవీతో కన్నా రామాయణతో పోటీ బెటర్'

ఎంత మంచి సినిమా తీసినా, సరైన రిలీజ్ డేట్ దొరకకపోతే ఆశించిన రిజల్ట్ రావడం కష్టం.

Update: 2026-10-22 10:03 GMT

ఎంత మంచి సినిమా తీసినా, సరైన రిలీజ్ డేట్ దొరకకపోతే ఆశించిన రిజల్ట్ రావడం కష్టం. అందుకే ఆ విషయంలో నిర్మాతలు చాలా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు రీసెంట్ గా 'సమ్మర్ హాలిడేస్' మూవీ ప్రెస్ మీట్‌ లో ఆ విషయంపై యంగ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి.. ఆ మూవీ అక్టోబర్ 30న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు నవంబర్ 6వ తేదీన గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

అయితే అక్టోబర్ 30న వెంకటేష్ ఆదర్శకుటుంబం మూవీ రిలీజ్ అవుతుండడంతోనే సమ్మర్ హాలీడేస్ ను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. కానీ నవంబర్ 5న రామాయణ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఆ విషయంపై ధీరజ్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఏదైనా సినిమాను శుక్రవారం విడుదల చేస్తే శని, ఆదివారాలు మాత్రమే ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు టైమ్ దొరుకుతుందని చెప్పారు.

కానీ మొదట అనుకున్న అక్టోబర్ 30న వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం పోటీలో ఉందని గుర్తు చేశారు. తెలుగు ప్రేక్షకులకు వీరిద్దరూ విడివిడిగానూ, కలిసి చేసినప్పుడు కూడా ఎంతో ఫేవరెట్ అని ఆయన అన్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ అనగానే ఆ మొదటి రెండు రోజులు ఆడియన్స్ అందరూ కచ్చితంగా ఆ సినిమా వైపే ఇంట్రెస్ట్ చూపిస్తారని, థియేటర్లన్నీ ఆ సినిమాతోనే నిండిపోతాయని చెప్పారు.

ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి సాధారణంగానే థియేటర్లలో ఆడియన్స్ తగ్గుతారని, దీనివల్ల తమలాంటి సినిమాలకు కలెక్షన్లు రాబట్టడానికి తగిన విండో దొరకదని అన్నారు. అయితే రామాయణ పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలున్న చాలా పెద్ద సినిమా అని ఆయన ఒప్పుకున్నారు. కానీ అది ఒక హిందీ సినిమా అని, మన స్ట్రయిట్ తెలుగు సినిమా కాదు అని ఆయన గుర్తు చేశారు.

సాధారణంగా మనం తెలుగులో చిన్నప్పటి నుంచి చూసిన, చదివిన రామాయణ స్టోరీల పద్ధతికి, హిందీ ఇండస్ట్రీ వాళ్లు స్క్రీన్ పై చూపించే విధానానికి కల్చరల్ డిఫరెన్స్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీజీ వర్క్స్, మేకింగ్ స్టైల్ కూడా మన సినిమాల కంటే వేరేగా ఉంటుందని చెప్పారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ అయిపోయే వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమాతో పోటీ పడి నష్టపోవడం కంటే, హిందీ 'రామాయణం' సినిమాతో పోటీ పడటమే తమ సినిమాకు సేఫ్ అనిపించిందని ధీరజ్ స్పష్టం చేశారు.

వెంకటేష్ గారి సినిమా చేతిలో దెబ్బతినడం కంటే, హిందీ రామాయణం సినిమాతోనే పోటీ పడి చద్దామనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నామని నవ్వుతూ అన్నారు. అయితే 'సమ్మర్ హాలిడేస్' ఒక ప్యూర్ తెలుగు సినిమాగా గ్రాండ్ రూపొందుతోంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని (ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్) గిరిబాబు వల్లభనేనితో కలిసి సంయుక్తంగా ఆ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీకార్ నయన్ జి దర్శకత్వం వహించారు. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అంతా వేచి చూడాలి.



Tags:    

Similar News