అల్లు అర్జున్ తిట్టడనే నమ్మకంతో.. విజయ్ దేవరకొండ కాల్!

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోల మధ్య ఉన్న సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడుతో పోల్చితే స్టార్ హీరోల మధ్య స్నేహ భావం బాగుంది.

Update: 2026-10-22 05:58 GMT

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోల మధ్య ఉన్న సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడుతో పోల్చితే స్టార్ హీరోల మధ్య స్నేహ భావం బాగుంది. రెగ్యులర్‌గా పార్టీలకు హాజరు అవుతూ, ఒకరి సినిమాల గురించి మరొకరు స్పందిస్తూ, ఒకరి సినిమాల ప్రమోషన్‌లో మరొకరు పాల్గొనడం ద్వారా ఒక మంచి వాతావరణం క్రియేట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు హీరోల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరోను తక్కువ చేస్తూ మాట్లాడుకోవడం, ట్రోల్స్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. రియాల్టీకి వస్తే ఆయా హీరోలు మంచి స్నేహితులుగా మసులుకుంటున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ల మధ్య సాగిన సంభాషణలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇద్దరి మద్య మంచి బాండింగ్‌ ఉందని వెళ్లడి అయింది. ఈ సంఘటన కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 9 లో చోటు చేసుకుంది.

కరణ్‌ జోహార్‌ టాక్‌ షో లో....

కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్‌ సీజన్‌ 9 లో ఇటీవల విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పాల్గొన్నారు, రణబాలి సినిమా ప్రమోషన్‌లో భాగంగా కాఫీ విత్ కరణ్‌ టాక్‌ షో లో పాల్గొన్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలను కరణ్‌ తో షేర్‌ చేసుకున్నారు. తాజాగా జియో హాట్‌ స్టార్‌ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కాఫీ విత్‌ కరణ్‌ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అయింది. ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అయిన వెంటనే చాలా మంది అందులోని చిన్న చిన్న బిట్స్‌ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ కాల్‌ చేసిన వీడియో బిట్‌ ను షేర్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో విజయ్ దేవరకొండ మాట్లాడిన ఫోన్‌ కాల్‌ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అల్లు అర్జున్‌కి విజయ్‌ దేవరకొండతో ఉన్న సన్నిహిత్యం ఏంటి అనేది ఈ ఘటనతో వెళ్లడి అయింది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నల షో...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నల కాఫీ విత్‌ కరణ్‌ ఎపిసోడ్‌ రాత్రి సమయంలో షూట్‌ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో ఒక స్టార్‌కి ఫోన్ చేయమంటూ కరణ్‌ అడిగిన సమయంలో విజయ్ దేవరకొండ ఆలోచించి అల్లు అర్జున్‌కి కాల్‌ చేశాడు. ఆ సమయంలో అల్లు అర్జున్‌కి ఫోన్‌ చేస్తేనే తిట్టకుండా ఫోన్‌ ఎత్తి మాట్లాడుతాడనే ఉద్దేశంతో విజయ్‌ దేవరకొండ ఆయనకు కాల్‌ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. బన్నీ అన్నా అంటూ విజయ్ దేవరకొండ చాలా సమయంలో అల్లు అర్జున్‌తో మాట్లాడాడు. పడుకున్నారా అంటూ మొదట ప్రశ్నించి, ఆ తర్వాత తాను కరణ్‌ జోహార్‌ టాక్ షో లో ఉన్నట్లుగా చెప్పాడు. కరణ్‌ జోహార్ చెప్పడం వల్ల ఫోన్ చేయాల్సి వచ్చిందని అన్నాడు. పక్కనే ఉన్న కరణ్‌ జోహార్‌ సైతం అల్లు అర్జున్‌ తో మాట్లాడాడు. ఇక రష్మిక మందన్న సైతం పక్కన ఉన్న విషయాన్ని గుర్తించిన అల్లు అర్జున్‌ ఆమెతోనూ మాట్లాడాడు. రష్మిక ఎందుకు మొదట తనకు ఫోన్‌ చేయలేదని ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక నేను చేద్దామని అనుకున్నాను, విజయ్ వద్దు అన్నాడని సరదాగా చెప్పింది. మొత్తానికి అల్లు అర్జున్‌తో విజయ్‌, రష్మిక లు కరణ్‌ షో కోసం చాలా సమయం మాట్లాడారు.

అల్లు అర్జున్‌తో విజయ్‌ దేవరకొండ ఫోన్‌ కాల్‌...

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రష్మిక మందన్న పట్ల విజయ్‌ దేవరకొండ ప్రవర్తను చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. క్రేజ్‌ లో విజయ్‌ దేవరకొండ కంటే రష్మిక మందన్న ముందు ఉంటుంది, ఆమె కెరీర్‌ చూసుకున్నా ఎక్కడో ఉంది, అయినా కూడా రష్మికను విజయ్ చిన్నచూపు చూసినట్లుగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొందరు కొన్ని సాక్ష్యాలు పెట్టి మరీ టార్గెట్‌ చేస్తున్నారు. అయితే రష్మిక మందన్న మాత్రం విజయ్‌ పై చాలా ప్రేమను కనబర్చుతూ మాట్లాడే విధానం ముచ్చటేస్తుంది. ఇటీవల ఇద్దరు కలిసి బతుకమ్మ ఆడటం, రష్మిక వెంట అన్ని విధాలుగా విజయ్ ఉండటం మనం చూడవచ్చు. కనుక ఈ విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. సోషల్‌ మీడియాలో కొందరు కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా వ్యవహరిస్తున్నారు అని విజయ్‌-రష్మికల ఫ్యాన్స్‌ అంటున్నారు.



Tags:    

Similar News